ETV Bharat / city

HACKING: సప్లై చైన్ ఎటాక్​తో డేటా చౌర్యం - Supply Chain Attack in Hyderabad

అమాయకులకు వల వేయడానికి, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడానికి, సంస్థల భద్రతా వ్యవస్థపై దాడి చేసి వినియోగదారుల డేటా చౌర్యం చేయడానికి సైబర్ కేటుగాళ్లు రోజుకో పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా సప్లై చెన్ ఎటాక్ పేరుతో కంప్యూటర్ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారు. సరైన రక్షణ విధానం లేని కంప్యూటర్లు, ఫోన్లు వాడుతున్న వారంతా వీరి కోరల్లో చిక్కుకుంటున్నారు.

HACKING
డేటా దొంగతనం
author img

By

Published : Jul 11, 2021, 10:44 AM IST

సైబర్‌ నేరాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. కంప్యూటర్‌ వ్యవస్థను అతలాకుతలం చేసే రాన్సమ్‌వేర్‌కు కొనసాగింపుగా సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త ప్రక్రియకు తెరలేపారు. ‘సప్లై చైన్‌ ఎటాక్‌’ పేరుతో మొదలైన ఈ కొత్త దందా ఇప్పుడు ప్రపంచ వ్యాపార సంస్థలను వణికిస్తోంది.

ఇది ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికాలోని అనేక రాష్ట్రాలకు చమురు సరఫరా చేస్తున్న ‘కలోనియల్‌ పైప్‌లైన్‌’ సంస్థపై దాడి చేయడంతో ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడి ప్పుడే మన దేశంలోని అనేక సంస్థలూ ఈ కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఆపరేటింగ్‌ సిస్టం అసలైనదై ఉండాలని, ఉచితంగా ఇచ్చే యాంటీ వైరస్‌ను వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలానే సంస్థలైతే తమకు తాము ప్రత్యేక సైబర్‌ భద్రతా విధానాన్ని రూపొందించుకోవాలని చెబుతున్నారు.

ఏమిటీ ‘ఎటాక్‌’..

వన్నా క్రై పేరుతో 2017లో ప్రపంచవ్యాప్తంగా అనేక కంప్యూటర్లపై జరిగిన సైబర్‌ దాడి నేపథ్యంలో రాన్సమ్‌వేర్‌ గురించి జనాలకు తెలిసింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు దాన్ని వాడుతున్న కంప్యూటర్లలోకి చొరబడి, వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. డబ్బే లక్ష్యం. దాదాపు నాలుగు రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు దీని బారినపడ్డాయి. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.

సరైన రక్షణ విధానం లేని కంప్యూటర్లు, ఫోన్లు వాడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశ్లీల సైట్లు చూసేవారు, ఉచితంగా దొరికే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వారు కూడా ఇలాంటి వాటి బారినపడుతున్నారు.

ఇప్పుడు ఒకేసారి అనేక సంస్థలను సైబర్‌ నేరగాళ్లు తమ వశం చేసుకుంటున్నారు. ఉదాహరణకు గతంలో ఊర్లో ఒక కుటుంబాన్ని హత్య చేయాలంటే వారు తాగే నీళ్లలో విషం కలిపేవారనుకుంటే... ‘సప్లై చైన్‌ ఎటాక్‌’ నేరగాళ్లు మాత్రం ఊర్లో అందరూ తాగేందుకు మంచినీటిని సరఫరా చేసే ట్యాంకులో విషం కలుపుతున్నారన్నమాట. అంటే బాధితులు మూకుమ్మడిగా ఎక్కువ మంది ఉంటారన్నమాట. అలాగే మనం వాడే ఫోన్లలో వివిధ అంశాలను మరింత మెరుగుపరుస్తూ తరచుగా అప్‌డేట్లు వస్తుంటాయి. సైబర్‌ నేరగాళ్లు ఆ ఫోన్‌ సంస్థనే లక్ష్యంగా చేసుకుంటే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందుకునే ఫోన్లన్నీ వారి ఆధీనమై పోతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సప్లై చైన్‌ ఎటాక్‌’ మూల స్వరూపం ఇదే.

ఇలాంటి దాడులు ఇప్పుడిప్పుడే మన దగ్గరా మొదలైనట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎవరూ ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

జాగ్రత్తలే ముఖ్యం:

కృష్ణశాస్త్రి పెండ్యాల

ఈ కొత్త ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని సంస్థలూ సైబర్‌ భద్రత పెంచుకుంటున్నాయి. తమ వినియోగదారు లకు సాఫ్ట్‌వేర్‌ పంపుతున్నప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుంటున్నాయి. అయితే ఇదొక్కటే సరిపోదు. ఎవరికివారు వ్యక్తిగతంగా, సంస్థాపరంగా కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. తెలియని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ జోలికి వెళ్లొద్దు. సంస్థలు సైబర్‌ భద్రతపై ఉద్యోగులకూ తరచుగా అవగాహన తరగతులు నిర్వహించాలి.

- కృష్ణశాస్త్రి పెండ్యాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.