రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది. కొవిడ్ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా 8 జిల్లాల్లో ఈ సడలింపు సమయం వర్తించనుంది. ఈ ఐదు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నట్లే సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపు ఉంటుంది. జులై 1 నుంచి 7 వరకు తాజా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఐదు జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: