రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంపై నిర్దిష్టమైన కార్యాచరణ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్... దీనికి సంబంధించిన బాధ్యతల్ని ప్రణాళికా విభాగానికి అప్పగించారు. స్పందన కార్యక్రమం ద్వారా 12 ప్రభుత్వ శాఖల నుంచి 95 శాతం మేర ఫిర్యాదుల స్వీకరణ జరుగుతోందని సీఎం జగన్ దీనిపై సమీక్షిస్తున్నందున సకాలంలో సమస్యలు పరిష్కరించాలని నిర్ధేశించారు. అక్టోబరులో తహసీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా స్థాయిలో సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'
: