ETV Bharat / city

కళాకారులారా.. క్రౌడ్‌ఫండింగ్‌ సాయం కావాలా ? - crowdfunding agencies details

మనం చదువుకోవాలంటే బ్యాంకు లోన్‌ ఇస్తుంది... స్టార్టప్‌ పెట్టాలంటే పెట్టుబడి సంస్థలు ముందుకొస్తాయి... కానీ మనం ఏ ఆర్టిస్టో... ఫొటోగ్రాఫరో... సింగరో... డాన్సరో... కావాలంటే ఎవరు సాయం చేస్తారు? దగ్గరివారు కూడా ‘అన్నంపెట్టని కళలతో టైమ్‌ వేస్ట్‌ చేయొద్దు’ అనే రోజులివి. దగ్గరివాళ్లు కాకపోతేనేం... దూరంగా ఉన్నా కళలపైన ఎంతో కొంత మక్కువున్నవాళ్లు సాయం చేయాలనుకోవచ్చు కదా! అలాంటి వాళ్లందరినీ వర్థమాన కళాకారులకి చేరువచేస్తున్న క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థల గురించి తెలుసుకుందాం రండి...

crowdfunding agencies helping to artists
ళాకారులకి కోసం క్రౌడ్‌ఫండింగ్‌ సాయం
author img

By

Published : Jan 3, 2021, 8:58 PM IST

వ్యక్తిగత సాయం

సమీరా మరువాడ... వైజాగ్‌ అమ్మాయి. ఇంజినీరింగ్‌ చదివి, ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ కొంతకాలం చేసింది. అవన్నీ వదిలేసి ఫ్రీలాన్స్‌ కార్టూనిస్టుగా మారింది. ‘సాల్ట్‌ అండ్‌ సాంబార్‌’ పేరుతో తెలుగు కుటుంబాల్లోని హాస్యాన్ని చక్కగా పండిస్తూ ఇంగ్లిష్‌లో కార్టూన్‌ సిరీస్‌లు మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామే ఆమె వేదిక. కానీ ‘ఇన్‌స్టా’ నుంచి డబ్బులు రావు కదా... మరి తన జీవనం గడిచేదెలా! అందుకు ‘పాట్రియాన్స్‌’ క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికను ఎంచుకుంది సమీర. సుమారు 150 నుంచి 800 రూపాయల దాకా వివిధ స్లాట్‌లలో ఎవరైనా ఏ కళాకారులకైనా దీనిద్వారా సాయం చేయొచ్చు. పాట్రియాన్స్‌ ద్వారా వచ్చిన డబ్బుతో బొమ్మలు గీయడానికి కావలసిన సరంజామాని కొనుక్కుంటాను- అంటుంది సమీర. అలా కార్టూనిస్టుగా, ఇలస్ట్రేటర్‌గా నిలదొక్కుకుని యూట్యూబ్‌లో తరగతులు నిర్వహించడం మొదలుపెట్టింది. ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ వంటివాటిలోనూ శిక్షణా తరగతులు నిర్వహించే స్థాయికెళ్లింది! సమీరలాంటి వేలాది మంది కళాకారులకి ప్రాథమికంగా కావాల్సిన ఆర్థిక దన్నుని ఇస్తోంది పాట్రియాన్స్‌. ప్రాజెక్టేదీ చూపకున్నా కళాకారులుగా వ్యక్తిగత సాయం కోరవచ్చన్నది దీని ప్రత్యేకత!

సినిమాలకి మాత్రమే..!

‘అమూల్‌’ సంస్థ విజయంపైన ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌బెనగల్‌ తీసిన ‘మంథన్‌’ మనదేశంలో తొలి క్రౌడ్‌ఫండింగ్‌ సినిమా అని చెబుతారు. ఆ తర్వాత దేశంలో ఎంతోమంది క్రౌడ్‌ఫండింగ్‌ సినిమాల్ని తీశారు. తెలుగులో ‘మను’, ‘పెసరట్టు’ వంటివి వచ్చాయి. కాకపోతే, ఇవన్నీ ఆయా దర్శక నిర్మాతలకి తెలిసినవాళ్ళు, వాళ్ల సోషల్‌మీడియాల ద్వారా తీసినవి. అలాకాకుండా, అచ్చంగా క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థ ద్వారా రూపొందించిన సినిమాలు మన దగ్గర తక్కువ. కమీషన్‌లూ, వాటికున్న నియమాలూ ఇందుకో కారణం. అందుకే, అలాంటి కమీషన్లేమీ లేకుండా యువ సినిమా కళాకారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చేలా ‘ఎల్లో స్కూటర్‌ స్టూడియో’ అనే క్రౌండ్‌ఫండింగ్‌ సంస్థ ఇటీవల ఏర్పాటైంది. కమీషన్‌లాంటివి తీసుకోకపోవడమే కాదు... కథ బాగా నచ్చితే ప్రాజెక్టుకి అవసరమైన డబ్బులో మరో 25 శాతం కూడా ఈ సంస్థ అందిస్తుంది. విరాళాలు సేకరించడంతోపాటూ... కొత్త దర్శకులకి సినిమా తీయడంలో అన్నిరకాలా తమ సంస్థ సాయం చేస్తుందని చెబుతున్నాడు దీని వ్యవస్థాపకుడు చేట్‌ జైన్‌. ఎన్జీఓలూ, ఇతర సామాజిక సేవా సంస్థలకి క్రౌండ్‌ఫండింగ్‌ ద్వారా సాయపడే ‘క్రౌడ్‌ఎరా’ అనే సంస్థ కూడా ఆయనదే. సామాజిక స్పృహతో సినిమాలు తీయాలనుకునేవాళ్లకి సాయపడాలనే ఈ ‘ఎల్లో స్కూటర్‌ స్టూడియో’ని ఏర్పాటుచేశానంటున్నాడు చేట్‌.

ప్రాజెక్టు ఉంటే ఓకే...

ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తుండేవాడు లోకేష్‌ దొడ్ల. ఓ దశలో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ మీద దృష్టిపెట్టాడు. మనదేశంలోని వన్యమృగ అభయారణ్యాలన్నీ చుట్టి అద్భుతమైన ఫొటోలు తీశాడు. వాటిల్లో కొన్ని ప్రఖ్యాత ఆర్ట్‌గ్యాలరీల్లో చోటు సాధించాయి. ఆ ఫొటోలన్నింటితో ఓ చక్కటి ‘కాఫీటేబుల్‌ బుక్‌’ తయారుచేయాలనుకున్నాడు లోకేష్‌. దానికి లక్షల్లో ఖర్చవుతుంది... ఆ డబ్బు ఎవరివ్వాలి! అందుకే ప్రచురణ కోసం ‘విష్‌బెర్రీ’ సంస్థని ఆశ్రయించాడు. రామ్‌గణేశ్‌ కమతం... ఆంగ్ల నాటకాల రంగంలో మంచి పేరున్న తెలుగు దర్శకుడు. ఆయన గత ఏడాది చేపట్టిన ‘అల్టిమేట్‌ మహాభారత’ అనే ప్రాజెక్టుకి అవసరమైన 2.8 లక్షల రూపాయల్ని విష్‌బెర్రీ సమకూర్చింది! ఇలా గత పదేళ్లలో 500 ప్రాజెక్టుల కోసం 17 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది ‘విష్‌బెర్రీ’ సంస్థ. సినిమాలు, సంగీతం, డాన్స్‌, రంగస్థలం, ఫొటోగ్రఫీ, పుస్తకాల ప్రచురణ తదితర రంగాల కోసం విష్‌బెర్రీ సాయం అందిస్తుంది. కాకపోతే ఇందులో సాయమడగటానికి ప్రతిదీ ఓ ప్రాజెక్టుగా ఉండాలి. అంటే- సంగీతం అయితే మీరో ఆల్బమ్‌ తయారుచేయడానికీ, డాన్స్‌ అయితే ప్రదర్శన ఏర్పాటు చేయడానికీ సాయం అడగొచ్చన్నమాట! ప్రియాంకా అగర్వాల్‌, అన్షులికా దూబేలు ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు.

ఇదీ చూడండి: టీకా అనుమతులు వచ్చేశాయ్​.. పంపిణీ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.