అమరావతిపై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తప్పుబట్టారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని ఆయన చెప్పటం ప్రజలను మోసం చేయటమేనని పేర్కొన్నారు. తక్షణం ఆయన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ప్రకటించాలని కోరారు. విభజన చట్టంలో చెప్పినట్లుగా రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: