రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రజలు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే... సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కొవిడ్-19 కట్టడికి చర్యలు తీసుకుంటుంటే... జగన్ మాత్రం గ్రామాలకు ఇంటర్నెట్, నగదు పంపిణీ అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.
గడచిన 2 వారాల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు 3 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, ఈ పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకుల సలహాలు, సూచనలతో.. ముందుగా కరోనాను కట్టడి చేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: