అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండ రోజుల్లోనే... సభలో గందరగోళం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులు తగ్గించారని ఆరోపించారు. సాగునీరు, పరిశ్రమల రంగాలకు నిధుల్లో కోతలు విధించారని మండిపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని... సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లాక మళ్లీ సభలో ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నించారు. పెట్రో, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 20న నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఇదీ చదవండి: ద్రవ్యవినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: యనమల