పెరుగుతున్న ఇంధన ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రధాని మోదీ చిత్రపటంతో పాటు పెట్రోలు, డీజిల్ ఫొటోలనూ అంతరిక్షంలోకి పంపాలని ఎద్దేవా చేశారు. ఇంధన ధరల పేరిట సామాన్యుల జేబులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయని విమర్శించారు.
పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస ప్రకటించడం పెద్ద నాటకమన్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రావడం పట్ల పెద్దగా భయపడాల్సిన పనిలేదని నారాయణ అభిప్రాయపడ్డారు. వరవరరావుకు బెయిల్ మంజూరవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి