ఏపీ రాజకీయ పరిణమాలు చాలా ప్రమాదకరంగా మారిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వ యంత్రాంగాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను శత్రువుగా భావిస్తూ.. సీఎం జగన్ ప్రతిష్టకు పోతున్నారని విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారే ఎన్నికల కమిషన్‌తో వివాదాలు పెట్టుకోకుండా జాగత్రపడ్డారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హుందాతనంతో వ్యవహరించాలని.. లేనిపక్షంలో రాజకీయ సంక్షోభం తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదు: సీపీఐ రామకృష్ణ