ETV Bharat / city

గెలుపు పై నమ్మకమే ఉంటే దౌర్జన్యాలు ఎందుకు..? సీపీఐ నారాయణ - ap muncipal elections 2021 latest updates

గెలుపు పై వైకాపా ప్రభుత్వానికి నమ్మకమే ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్నామని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
author img

By

Published : Mar 2, 2021, 9:51 PM IST

జగన్ దృష్టిలో విజయవాడ.. రాజధాని ప్రాంతం కాదేమో కానీ తమ దృష్టిలో రాజధాని విజయవాడ ప్రాంతమేనని.. ఇక్కడి నుంచే ఓటర్లు వైకాపాకు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్​లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ,రాజన్న పాలనపై నమ్మకమే ఉంటే ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. నమ్మకం లేకనే అప్రజాస్వామికంగా ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు రావాలని.. అందుకు రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ నాంది కావాలని వ్యాఖ్యానించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్నామని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.