ETV Bharat / city

561 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స

author img

By

Published : May 2, 2021, 8:21 AM IST

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న కొవిడ్​ కేర్​ సెంటర్లు, ఆస్పత్రులు చికిత్సకు సరిపోవటం లేదు. దీంతో క్రమంగా కరోనాకు వైద్యం అందించే ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రైవేట్​ ఆస్పత్రులే ఎక్కువగా ఉంటున్నాయి.

covid treatment
కొవిడ్‌ చికిత్స అందించే ఆస్పత్రులు

రాష్ట్రంలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు క్రమేపి పెరుగుతున్నాయి. వీటిలో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఏప్రిల్‌ 21న 185 ప్రైవేట్‌, ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి ఐసీయూ 2,630, ఆక్సిజన్‌ 11,237, సాధారణ పడకలు 5,889 ఉండగా.. మే 1న 561 ప్రైవేట్‌, ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి 6,191 ఐసీయూ, 20,542 ఆక్సిజన్‌, 13,412 సాధారణ పడకలు అందుబాటులోకి వచ్చాయి. కేసులు పెరుగుతుండడంతో కొవిడ్‌ చికిత్సను అందించేందుకు దరఖాస్తులు చేసుకుంటున్న ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధిత జిల్లా యంత్రాంగం వెనువెంటనే అనుమతులు ఇచ్చేస్తోంది. నిన్న గంటల వ్యవధిలోనే తొమ్మిది ఆసుపత్రులకు అనుమతి లభించింది. వీటిల్లో జిల్లాకు పదిలోపే ప్రభుత్వాసుపత్రులు ఉంటున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేటువే. సుమారు 480 వరకు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉంటాయని అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయి. ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ విభాగాల్లో కలిపి గరిష్ఠంగా 50వరకు పడకల భర్తీకి మాత్రమే జిల్లాల అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో గరిష్ఠంగా 71 ఆసుపత్రుల్లో, కృష్ణాలో 65, ప్రకాశం 32, చిత్తూరు 42, కడప 20, విశాఖ జిల్లాలో 51 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందుబాటులోకి వచ్చింది.

ఇదీ చదవండి: ఆసుపత్రుల్లో డిశ్ఛార్జి డ్రైవ్.. పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

పదుల సంఖ్యలోనే పడకలు ఖాళీ:

కేసులు అధికంగా ఉండడంతో.. జిల్లాల్లో ఉన్న ప్రైవేట్‌ వైద్య కళాశాలలు మినహాయించి మిగిలిన ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో మాత్రమే పడకలు ఖాళీగా ఉంటున్నాయి. విజయవాడలోని పిన్నమనేని వైద్యకళాశాలలో నిన్న రాత్రికి ఒక ఐసీయూ, 93 సాధారణ పడకలు ఖాళీగా ఉన్నాయి. కామినేని ఆసుపత్రిలో ఒక్కటీ లేదు. నిమ్రాలో 168 సాధారణ, ఇండో బ్రిటిష్‌ ఆసుపత్రిలో రెండు ఆక్సిజన్‌, ఒక సాధారణ పడక ఖాళీగా ఉంది. గుంటూరు జిల్లాలోని ఎన్నారై ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్‌, 35 సాధారణ, ఎయిమ్స్‌లో 2 సాధారణ, కాటూరి వైద్యశాలలో 32 సాధారణ, ఆదిత్య మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో 12 ఐసీయూ, 69 ఆక్సిజన్‌, 15 సాధారణ పడకలు ఖాళీగా ఉన్నాయి. మణిపాల్‌ ఆసుపత్రిలో ఒక్క పడక కూడా అందుబాటులో లేదని డ్యాష్‌బోర్డులో పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలి
జిల్లా అధికారులు అనుమతులిచ్చే ఆసుపత్రుల్లో బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. జనరల్‌ ఫిజీషియన్‌, పల్మనాలజిస్ట్‌/మత్తుమందు వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. ఆసుపత్రుల్లోకి బాధితులు వచ్చేందుకు...వెళ్లేందుకు ప్రవేశ మార్గాలు విడివిడిగా ఉండాలి.

ఇదీ చదవండి: విదేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు 7 యుద్ధ నౌకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.