ETV Bharat / city

కొవిడ్ కమాండ్ కంట్రోల్: డేటా అనాలసిస్ కోసం స్పెషల్ ఆఫీసర్

author img

By

Published : Apr 24, 2021, 8:21 PM IST

కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మరో ఉన్నతాధికారిని ప్రభుత్వం నియమించింది. సమాచార విశ్లేషణ ప్రత్యేకాధికారిగా పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్‌ కేంద్రంలో ఇప్పటికే 22 మంది అధికారులుండగా మరో ఉన్నతాధికారిని నియామకం చేసింది.

డేటా అనాలసిస్ కోసం స్పెషల్ ఆఫీసర్
డేటా అనాలసిస్ కోసం స్పెషల్ ఆఫీసర్

కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేందుకు... రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొవిడ్ కమాండ్ కంట్రోల్​కు వచ్చే సమాచార విశ్లేషణ కోసం (డేటా అనాలసిస్) ప్రత్యేకాధికారిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జెవీఎన్ సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సమాచార విశ్లేషణతో పాటు ఆస్పత్రులకు కావాల్సిన అత్యవసర సామగ్రి సేకరణ, కొనుగోళ్లు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను సమన్వయం చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఇప్పటికే 22 మంది అధికారులను వివిధ అంశాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నియమించింది.

ఇదీ చదవండి:

హయ్యర్ ఎడ్యుకేషన్: విద్యాసంస్థల నిర్వహణపై తర్జనభర్జన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.