* ఐటీ విభాగంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నైపుణ్య కేంద్రం)లో సాఫ్ట్‌వేర్ కోర్సులకయ్యే వ్యయాన్ని ఐబీఎం భరిస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పన, ఆధునాతన శిక్షణ ఇవ్వనుంది.
* విశాఖపట్నంలో మీడియా, వినోద రంగాల్లో కేంద్రాన్ని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్, టీవీ అకాడమీ ఏర్పాటు చేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పన చేస్తుంది.
* ఉత్పత్తిలో ఆధునాతన సాంకేతికత, ఫుడ్ ఇన్నోవేషన్, ప్రాసెసింగ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విభాగాల్లో సింగపుర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ కోర్సులను అందిస్తుంది.
* అతిథ్య రంగంలోని కేంద్రానికి భారత పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారం అందిస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను రూపొందిస్తుంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తుంది.
* ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ఒప్పందాల కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: