ETV Bharat / city

'గిరి'పుత్రుల జీవనమే వరం.. ఆ ప్రాంతాల్లో లేదు కరోనా భయం..! - మన్యం ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం

కరోనా.. మానవాళిని వణికిస్తోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా విస్తృతంగా వ్యాపిస్తూ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే పట్టణ జీవనానికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాలకు వచ్చేసరికి వైరస్​ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గిరిజనుల ఆహారపు అలవాట్లు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వలసలు లేకపోవడం కూడా వైరస్​ వ్యాప్తిని అడ్డుకుంటోంది. గిరిప్రాంతాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం..!

'గిరి'పుత్రుల జీవనమే వరం.. ఆ ప్రాంతాల్లో లేదు కరోనా భయం..!

author img

By

Published : Jul 12, 2020, 7:07 AM IST

కరోనా మహమ్మారి పట్టణాలను చుట్టేస్తోంది. గ్రామాలను అల్లుకుంటోంది. గిరిజన గూడేలకు మాత్రం కాస్త దూరంగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజనుల జీవనశైలి.. వలసలు లేకపోవడం వల్ల వైరస్‌ అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల్లో చేసినట్లు అక్కడ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో లేవు. ప్రసవం సమయంలో, అత్యవసర చికిత్స చేసేటప్పుడు.. అదీ అనుమానిత లక్షణాలుంటేనే పరీక్షలు చేస్తున్నారు. చుట్టుపక్కల కేసుల నమోదుతో కొన్నిచోట్ల స్థానికులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో ఐటీడీఏలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో రోజూ భారీగా కేసులు వస్తున్నా గిరిజన ప్రాంతాలపై ప్రభావం తక్కువగానే ఉంది. గిరిజనులు సాధారణంగా ఎక్కడికీ వెళ్లరు. పోడు వ్యవసాయం, అటవీ ఫలసాయంపైనే ఆధారపడుతున్నారు.

  • రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా విశాఖ జిల్లాలోనే ఉంది. 11 మండలాల్లో 247 పంచాయతీల్లో 6.02 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 7 కేసులే వచ్చాయి. బయటి నుంచి ఇక్కడకు వచ్చిన వారిలోనే వైరస్‌ కనిపించింది.
  • విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 మండలాలున్నాయి. సాలూరు, పార్వతీపురం వంటి పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్న గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లో పాజిటివ్‌ కేసులు లేవు. జియ్యమ్మవలస, పాచిపెంట, మక్కువ మండలాల్లో 11 కేసులు నమోదైనా అవన్నీ మైదాన ప్రాంత గ్రామాల్లోనే.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏడు మండలాలుంటే మైదాన, పట్టణ ప్రాంతాలైన పాతపట్నం, మెళియాపుట్టి, మందస గ్రామాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండే సీతంపేట మండలంలో ఒకే ఒక్క కేసు నమోదైంది. విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు మండలాల్లో స్వచ్ఛందంగా ఒకపూట లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. సంతలు నిలిపేశారు.

  • తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 20, చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు మండలాల్లో 10 కేసులు వచ్చాయి.
  • కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో ప్రకాశం జిల్లా గ్రామంలో ఒక కరోనా కేసు వచ్చింది.
  • పశ్చిమగోదావరి జిల్లా కె.ఆర్‌.పురం ఐటీడీఏ పరిధిలో ఇప్పటివరకు 11 కేసులు వెలుగుచూశాయి. పోలవరం ప్రాజెక్టులో పనిచేసే వారిలో ముగ్గురికి, స్థానికుల్లో ముగ్గురికి వైరస్‌ సోకింది.

రోగ నిరోధక శక్తి అధికం

గిరిజనుల ఆహారపు అలవాట్లు కూడా కరోనా వైరస్‌ను దూరం చేస్తున్నాయని విశాఖ జిల్లా నర్సీపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి పేర్కొన్నారు. రాగి జావ, సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వలసలు లేకపోవడంతోనూ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందన్నారు.

ఇదీ చూడండి..

రోగుల పాలిట సంజీవని.. ధన్వంతరి రథ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.