తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్.. అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా లక్షణాలు కనిపించడం వల్ల కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తన ద్వారా కుటుంబానికి వైరస్ సోకకూడదని భావించిన అశోక్ హోం ఐసోలేషన్‌లో ఉండాలనుకున్నాడు.
కానీ.. తన కుటుంబమంతా ఒకే గదిలో నివసిస్తుండటం వల్ల హోంక్వారంటైన్ వీలుపడలేదు. అలా అని ఆస్పత్రికి పోయే స్థోమత లేదు. తన వల్ల కుటుంబానికి ఏం కాకూడదని తలచిన అశోక్ గత్యంతరం లేక మూడ్రోజులుగా బాత్రూంలోనే క్వారంటైన్ అయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బాధితుడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
ఇవీ చదవండి: