హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 11 మంది పోలీసులకు కొవిడ్ సోకింది. సీఐ, ఎస్సైతో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లకు వైరస్ నిర్ధరణ అయింది.
మొదటి దశ కొవిడ్ సమయంలోనూ ఇదే స్టేషన్‌లో 50 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో... సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఇవీ చూడండి: