ETV Bharat / city

ఆ రంగంలో ఇప్పుడు నష్టాలున్నా తర్వాత లాభాలే..!

author img

By

Published : Apr 26, 2020, 6:00 PM IST

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. దాదాపు అన్ని రంగాల్లో ఉత్పత్తులు నిలిచిపోయి నష్టాల భయం చుట్టేసింది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం మాత్రం ఆశాజనకంగా ఉంటుందనే ధీమా డీలర్లలో వ్యక్తమవుతోంది. అందుకు కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

corona effect on automobile sector in ap state
కరోనాతో నష్టాల్లో ఆటోమొబైల్ రంగం

కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న తరుణంలో ఆటోమొబైల్ రంగం పైనా దీని ప్రభావం పడింది. ఉద్యోగుల జీతాలతో పాటు ఇతర ఖర్చులతో ఆటోమొబైల్ డీలర్ షిప్ సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తే.. ద్విచక్ర వాహనాలకు సంబంధించి దాదాపు 400 వరకూ షోరూములు ఉండగా.. 100 వరకూ 4 వీలర్, 15 వాణిజ్య రవాణా వాహనాల షోరూములు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం ఆర్జించే శాఖల్లో వాహన విక్రయాలు ఎంతో కీలకం. కరోనా ప్రభావంతో గడిచిన నెలరోజుల్లో ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఉగాది, దసరా, సంక్రాంతి.. వాహన విక్రయాలకు మంచి సీజన్. అలాంటిది ఈసారి ఉగాది సమయంలో లాక్ డౌన్ కారణంగా డీలర్లు షోరూములు తెరవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో సగటున ఏటా 80వేల వరకూ ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోతుంటే 4వీలర్ల అమ్మకాలు 50వేల వరకూ ఉంటాయని అంచనా.

కొనుగోళ్లు పెరిగే అవకాశం

లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు కుదుటపడేందుకు 6 నెలల సమయం పట్టినా.. తర్వాత వాహనాల కొనుగోళ్లు పెరిగి నష్టం భర్తీ అవుతుందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కరోనా వైరస్ అలవాటు చేసిన భౌతిక దూరమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సగటు వ్యక్తి ఆలోచనలో మార్పులు వచ్చి ఓ వ్యక్తి మరో ప్రయాణికుడితో కలిసి వెళ్లేందుకు భయపడే పరిస్థితులు వస్తే సొంత వాహనాల కొనుగోళ్లకు ప్రజలు మొగ్గు చూపుతారని డీలర్లు అంచనా వేస్తున్నారు. తాజా విక్రయాలు బీఎస్ 6 వాహనాలే. సాధారణ వాహనాలతో పోల్చితే వీటి వ్యయం 20శాతం వరకూ ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య భద్రత దృష్ట్యా విక్రయాలు ఆశాజనకంగానే ఉంటాయని చెప్తున్నారు. ఇదే సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.

మార్పులు చేస్తాం

లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమతమ షోరూముల్లో మార్పులు చేర్పులు తప్పవని డీలర్లు చెప్తున్నారు. ముఖ్యంగా రద్దీ ఏర్పడకుండా చూసుకోవాలని.. విక్రయాల సమయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయక తప్పదని తెలిపారు. ఇవి తమకు అదనపు భారం అవుతాయంటున్నారు డీలర్లు. ఇప్పటికే విక్రయించిన వాహనాలకు వారెంటీ గడువుతో పాటు లైఫ్‌ టైమ్‌ క్వాలిటీ కేర్‌ సౌకర్యం, ఉచిత సర్వీసులను అన్ని సంస్థలు జూన్ దాకా పొడిగించాయి.

పాడైపోతాయి.. జాగ్రత్త

లాక్ డౌన్ కారణంగా వాహనాలు వాడనివారు ఇంటివద్దే జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. చాలామంది అత్యవసరమైతే తప్ప బైకులు, కార్లు బయటకు తీయడం లేదు. చాలామంది తమ కార్లు కనీసం స్టార్ట్‌ చేయని పరిస్థితి ఉంది. వారం, 10 రోజులు అయితే పర్వాలేదు కానీ రోజుల తరబడి అలానే ఉంటే ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కారు సర్వీసింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. కారు, మోటార్‌ సైకిల్‌ ఇతర వాహనాల్లో ఉండే యంత్రాలు బ్యాటరీతోనే స్టార్ట్‌ అవుతుంటాయి. ఎక్కువ కాలం ఇంజిన్‌ను స్టార్ట్‌ చేయపోతే బ్యాటరీ పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి ఇంట్లోనే బళ్లను పార్క్ చేసి ఉంచితే.. వావానాల సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా కొంతసేపయినా వాహనాలను బయటకు తీయాలని సూచిస్తున్నారు. అలా చేయకుంటే ఇంజిన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.

ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు, వాటి విడి భాగాల తయారీ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేయడం వలన ఆటోమొబైల్ రంగంలో రోజూ కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆటోమొబైల్ రంగానికి అనుబంధంగా ఉండే టైర్ల తయారీ, విడి భాగాల ఉత్పత్తి, విక్రయాలు నిలిచిపోవటంతో ఆయా రంగాలు తిరిగి పుంజుకునేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి.. పాత్రికేయులకు రూ. 10 లక్షల బీమా కల్పించండి: కన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.