ETV Bharat / city

కరోనాకు సింహద్వారంగా మద్యం దుకాణాల పర్మిట్​ రూంలు - పర్మిట్​ రూంల వద్ద పాటించని కరోనా భద్రతలు

మద్యం ప్రియులతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పర్మిట్‌ రూంలు కిక్కిరిసిపోతున్నాయి. భౌతికదూరం అటుంచితే... అటు అమ్మేవారు, ఇటు తాగేవారు... ఎవరు కూడా కనీసం మాస్క్‌ ధరించటంలేదు. రెండో దశ కొవిడ్‌ వ్యాప్తి కేంద్రాలుగా మద్యం దుకాణాలు మారే ప్రమాదం పొంచి ఉంది. మద్యం విక్రయాలు పెంచడం తప్పితే... నిబంధనలు అమలులో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది.

covid cases increase due to permit rooms
కరోనాకు సింహద్వారంగా మద్యం దుకాణాల పర్మిట్​ రూంలు
author img

By

Published : Feb 26, 2021, 8:24 AM IST

లాక్‌డౌన్‌ నిబంధనల అనంతరం తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్​‌లో తెరుచుకున్న బార్లు, పర్మిట్‌రూంలు.. ఎక్కడ చూసినా మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి. కరోనా దృష్ట్యా ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాత్రైతే పరిస్థితి చెప్పనక్కర్లేదు.

పత్రాలకే పరిమితమైన నిబంధనలు..

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఎక్సైజ్‌ నిబంధనల మేరకు ప్రతి పర్మిట్‌ రూంలో మద్యం తాగేందుకు మాత్రమే సదుపాయాలు కల్పించాలి. అందుకోసం కుర్చీలు, తాగునీరు, శౌచాలయం వరకు మాత్రమే అనుమతించారు. పర్మిట్‌ రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి వ్యక్తిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ, అది ఎక్కడా కనిపించడం లేదు. అన్ని పర్మిట్‌రూంలలో పెద్దఎత్తున అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయి. మంచినీళ్లు, సోడా, వెజ్‌, నాన్‌వెజ్, స్నాక్స్‌తో పాటు పలురకాల చిరుతిళ్లకు పర్మిట్‌ రూంలు కేంద్రాలుగా మారాయి. మద్యం దుకాణదారులే ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు.

కరోనాకు సింహద్వారంగా మద్యం దుకాణాల పర్మిట్​ రూంలు

ఇష్టారాజ్యంగా...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 480 వరకు మద్యం దుకాణాలు, 280వరకు బార్లు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మరో 55 కొత్త బార్‌లకు అనుమతిచ్చింది. నిత్యం 10కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. వారాంతంలో 20కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుతో మద్యం అమ్మకాలు కట్టలు తెంచుకున్నాయి. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా పర్మిట్‌ రూముల్లోకి వెళ్తున్నారు మద్యం ప్రియులు. ఆహార పదార్థాలు, చిరుతిళ్ల అమ్మకాల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నిత్యం మందుబాబులతో కిక్కిరిసి ఉండే పర్మిట్‌ రూంలు రెండో దశ కరోనా వ్యాప్తికి దోహదం చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కానరాని పర్యవేక్షణ

ఎక్సైజ్‌ అధికారులు మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పితే పర్మిట్‌ రూమ్‌లను ఏ మాత్రం కట్టడి చేయడంలేదని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన గదులు కొన్ని చోట్ల విశాలమైన బార్‌లను తలపిస్తున్నాయి. నేరాలు, నేరగాళ్లకు ఇవి అడ్డాలుగా మారుతున్నా పోలీస్‌ యంత్రాంగం ప్రేక్షక పాత్రే పోషిస్తోంది.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్​షాట్లతో జవాబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.