ETV Bharat / city

38 రోజులు... 40,000 కేసులు - Corona cases increase in Guntur district

కరోనా సెకండవేవ్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే8 వరకు 1.2లక్షల మంది వైరస్ బారినపడ్డారు. కేవలం 38 రోజుల్లోనే 40 వేలకు పైగా కేసులు నమోదవ్వడాన్ని బట్టి చూస్తే.... వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్ఛు.

Covid cases
Covid cases
author img

By

Published : May 10, 2021, 12:16 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే 8 వరకు 1.2లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 7.47 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే మొదటి వారంలోనే అత్యధికంగా 40,382 కేసులు నమోదు కావడం జిల్లాలో వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. ఏప్రిల్‌లో 26,878, మేలో 8 రోజుల్లో మరో 13,504 కేసులు వచ్చాయి. 2020 మార్చి నుంచి 2021 మే 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 16.17 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 16.10 లక్షల మంది ఫలితాలు వెల్లడించారు. 14.9 లక్షల మందికి వైరస్‌ లేదని (నెగెటివ్‌ 92.53 శాతం)గా తేలగా.. 1,20,303 మందికి(7.47%) పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో 1,01,845 (84.66 శాతం) మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 17,627 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం 831 మంది వైరస్‌ బారిన పడి చనిపోయారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం

వ్యాధి తీవ్రత బాగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ముందంజలో ఉంది. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలను యంత్రాంగం వేగవంతం చేసింది. గత వారం సగటున రోజుకు 4-5 వేల పరీక్షలు చేశారు. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 6వేల నుంచి 7వేల మందికి పరీక్షలు చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌, యాంటీజెన్‌, రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. పరీక్షలు చేయగానే అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఫలితాలు వెలువడే వరకు ట్రైఏజ్‌ సెంటర్లలో ఉంచి వ్యాధి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకోకుండా ఉండడానికి ఆరు ప్రైవేటు ల్యాబ్‌లకు ఫలితాలు విశ్లేషించేలా అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఫలితాలు సైతం వేగంగా వస్తున్నాయి. పది రోజుల క్రితం నమూనాలు సేకరించిన నాలుగైదు రోజులకు ఫలితం వచ్చేది. ప్రస్తుతం 48 గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని వీడీఆర్‌ఎల్‌ ల్యాబ్‌లో ఇంకా 5వేలకు పైగా పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక్కడ కూడా సిబ్బందిని పెంచి సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించడానికి యంత్రాంగం చర్యలు చేపట్టింది.

కర్ఫ్యూ అమలుతో తగ్గుదల

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైరస్‌ తీవ్రత బాగా ఎక్కువగా ఉందని జిల్లా వైద్యవర్గాలు విశ్లేషించాయి. కేవలం 38 రోజుల్లోనే 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తించారు. వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్ఛు .సగటున ప్రతి నాలుగు నివాసాల్లో ఒకరిద్దరు వైరస్‌తో బాధపడుతున్నవారు ఉన్నారని ఒక అంచనా. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల పరిధిలో అత్యధిక కేసులు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ అమలు చేస్తోంది. పర్యవసానంగా మూడు, నాలుగు రోజుల నుంచి సగటున రోజుకు 150 నుంచి 250 కేసుల దాకా తగ్గుదల ఉంటోందని చెబుతోంది. కర్ఫ్యూ విధించక ముందు సగటున రోజుకు 1600 నుంచి 2వేల కేసులు వచ్చేవి. అలాంటిది ఈ నాలుగు రోజుల్లో 1300 నుంచి 1700 లోపే కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూ అమలు వల్ల కేసుల తగ్గుదల కనిపిస్తోందని, దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తే రానున్న రోజుల్లో ఉద్ధృతిని ఇంకా తగ్గించవచ్చనే యోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. ప్రధానంగా రహదారుల మీదకు జనాల రాకపోకలు నిలువరించడం, గుంపులుగా చేరకుండా చూడడం వంటి చర్యల ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయొచ్చని చెబుతున్నారు. మరో వారం, పది రోజుల వరకు కేసులు బాగా వచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సంకేతాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాకపోకలను నిలువరించడంపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే కేసుల పెరుగుదలకు సంబంధించి కేంద్రం నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. దీంతో ఈ పది రోజులు కర్ఫ్యూను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా రహదారుల మీద తిరుగుతున్న సుమారు 100 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. సోమవారం నుంచి 12 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచితే వాటిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఇష్టానుసారం సీటీ స్కాన్‌ వద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.