రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. వైరస్ బారిన పడి మరో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,654కు చేరింది.
రాష్ట్రంలో కరోనా నుంచి 1,98,339 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో48,746 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 28.60 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి..