రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2602 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. ఇందులో ఏపీకి చెందిన 2592 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 643 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలియచేసింది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు
గుంటూరుజిల్లా | 367 |
---|---|
చిత్తూరుజిల్లా | 328 |
అనంతపురంజిల్లా | 297 |
కర్నూలుజిల్లా | 315 |
కడపజిల్లా | 55 |
కృష్ణా జిల్లా | 37 |
నెల్లూరుజిల్లా | 127 |
ప్రకాశం జిల్లా | 53 |
శ్రీకాకుళం జిల్లా | 149 |
విశాఖజిల్లా | 23 |
విజయనగరంజిల్లా | 89 |
పశ్చిమగోదావరిజిల్లా | 109 |
కరోనా కారణంగా గడచిన 24 గంటల వ్యవధిలో 42 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 534కు పెరిగింది.
ఏ జిల్లాలో ఎంతమంది మృతులు
అనంతపురం జిల్లా | 6 |
చిత్తూరుజిల్లా | 5 |
తూర్పుగోదావరిజిల్లా | 5 |
ప్రకాశం జిల్లా | 5 |
గుంటూరుజిల్లా | 4 |
పశ్చిమగోదావరిజిల్లా | 4 |
కడపజిల్లా | 3 |
విశాఖజిల్లా | 3 |
కర్నూలుజిల్లా | 2 |
నెల్లూరుజిల్లా | 2 |
విజయనగరంజిల్లా | 2 |
కృష్ణా జిల్లా | 1 |
ఇక గడచిన 24 గంటల వ్యవధిలో 20, 245 నిర్ధారణా పరీక్షలు చేసినట్టు తెలిపిన ప్రభుత్వం ఇప్పటి వరకూ 12 లక్షల 60 వేల 512 నమూనాలు పరీక్షించినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 584 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో , 3230 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో 837 మంది డిశ్చార్జి అయ్యారు.