ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో (9ఏఎం- 9పీఎం) రాష్ట్రవ్యాప్తంగా 10,376 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,933కి చేరింది.
గత 24 గంటల్లో 61,699 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తంగా 19,51,776 పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75,720 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 63,864 మంది డిశ్ఛార్జి కాగా.. కొవిడ్‌తో తాజాగా 68 మంది మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో పదమూడు మంది, అనంతపురం జిల్లాలో తొమ్మిది మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు.. తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, నెల్లూరు.. శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కడప.. కృష్ణా.. విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. మొత్తంగా 1,349 మంది మరణించారు.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1,387 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1,215 కేసులు, కర్నూలు జిల్లాలో 1,124 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలివీ..