రాష్ట్రంలో పలు చోట్ల ఒప్పంద స్టాఫ్ నర్సులు నిరసన చేపట్టారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద స్టాఫ్‌నర్సులు సమ్మె చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టారు. అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. పదిరోజులుగా నిరసన చేస్తున్నా ఎలాంటి స్పందన లేదని ఆవేదన చెందారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే దాకా అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నామన్నారు. అవసరమైతే ఆ సేవలనూ నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
విశాఖ కేజీహెచ్‌లో విధులు బహిష్కరించి నర్సుల నిరసన బాట పట్టారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి: