ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు... దొడ్డిదారిలో ఏకగ్రీవాలు! - ఏపీలో పంచాయతీ ఎన్నికలు

ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకు, ప్రతిపక్ష మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అధికారపార్టీ నేతలు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. మొదట నచ్చజెబుతున్నారు.. ఆ తర్వాత బెదిరిస్తున్నారు. అప్పటికీ వినకపోతే కొన్నిచోట్ల భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. ఉపాధి హామీ బిల్లులు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పదవులు పంచుకుందామంటూ బేరాలు ఆడుతున్నారు.

elections
elections
author img

By

Published : Feb 3, 2021, 7:25 AM IST

‘ఎన్నికల్లో పోటీ చేశావంటే ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు ఇక ఎప్పటికీ రాకుండా చేస్తాం చూసుకో’ ..గుంటూరు జిల్లా పల్నాడులో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ప్రతిపక్ష మద్దతుతో సిద్ధమైన ఓ మాజీ సర్పంచికి అధికారపార్టీ నాయకుల బెదిరింపు. ‘మీ అన్నయ్య నామినేషన్‌ వేస్తాడట.. అదే జరిగితే నీ ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు జాగ్రత్త’ విశాఖ జిల్లాలో ఓ ఒప్పంద ఉద్యోగికి హెచ్చరికలు. ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకు, ప్రతిపక్ష మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అధికారపార్టీ నేతలు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. మొదట నచ్చజెబుతున్నారు.. ఆ తర్వాత బెదిరిస్తున్నారు. అప్పటికీ వినకపోతే కొన్నిచోట్ల భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఈసారి బలవంతపు ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకదృష్టి పెట్టడంతో... నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేయడంవంటి ఘటనలు తగ్గాయి. కానీ లోపాయికారీ బెదిరింపులు, ప్రలోభాలు, హెచ్చరికలు మాత్రం చాలాచోట్ల కొనసాగుతున్నాయి.

బిల్లులు ఆపేస్తామంటూ..

గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందినవారు ఉపాధిహామీ, నీరు-చెట్టు కింద చేసిన పనులకు ఇవ్వాల్సిన బిల్లుల్ని వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు బకాయిలు రావలసినవారూ ఉన్నారు. వారిలో బలమైన అభ్యర్థులు అనుకున్నవారిని... తమ పార్టీ మద్దతుతో పోటీచేస్తే బిల్లులు వచ్చేలా చూస్తామని కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు. మాట వినకపోతే ఆ బిల్లులు రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల పింఛన్లు, రేషన్‌ కార్డులు తీసేస్తామని, ఇళ్ల పట్టాల్ని, గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని రద్దుచేస్తామని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు వంటిచోట్ల పౌల్ట్రీ ఫారాలకు అనుమతుల్లేవంటూ తహసీల్దార్లతో విచారణ జరిపిస్తున్నారు. పోటీ చేసేవారితో పాటు, వారి మద్దతుదారులకూ వేధింపులు తప్పట్లేదు. చిరు వ్యాపారులు, క్వారీ యజమానులను వ్యాపారం దెబ్బతీస్తామని బెదిరిస్తున్నారు. మాజీ సర్పంచులు మళ్లీ పోటీ చేస్తే.. వారు పదవిలో ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయిస్తామని బెదిరిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తుల తగాదాలు, రెవెన్యూ వివాదాలు ఉన్నవారిని.. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరిస్తున్నారు. మరికొన్నిచోట్ల పాత కేసుల్ని తిరగతోడతామని హెచ్చరిస్తున్నారు.

గెలిచినా చెక్‌పవర్‌ రద్దు చేస్తాం

గుంటూరు జిల్లా పల్నాడులోని పలు నియోజకవర్గాల్లో బెదిరింపులు తీవ్రంగా ఉన్నాయి. ఉపాధిహామీ, రూర్బన్‌ వంటి కార్యక్రమాల కింద చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తామని హెచ్చరిస్తూనే, ఎన్నికల్లో గెలిచినా ఏదో ఒక కారణంతో చెక్‌పవర్‌ రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు. ‘రాష్ట్రంలో మరో మూడేళ్లు వైకాపా అధికారంలో ఉంటుంది కాబట్టి.. మూడేళ్లూ సర్పంచి పదవి మాదే. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే చివరి రెండేళ్లు మీకు ఇస్తాం. లేకపోతే మేమే కొనసాగుతాం’’ అనే ప్రతిపాదనల్నీ వైకాపా నాయకులు చేస్తున్నారు. పల్నాడులోని ఓ గ్రామంలో వైకాపాలోనే రెండు వర్గాలు పోటీకి సిద్ధమయ్యాయి. ఒక వర్గానికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి భర్తను ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్నాడని కేసు పెట్టి అరెస్టు చేశారు.

* మాచర్ల నియోజకవర్గం పరిధిలో 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడానికి అధికారపక్షం ప్రయత్నిస్తోంది. గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గంలో విధ్వంసకాండ జరిగినా పట్టించుకోనందుకు పోలీసులు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికీ అక్కడి పోలీసుల్లో మార్పు రాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

* గుంటూరు జిల్లాలోని ఒక తీరప్రాంత నియోజకవర్గానికి చెందిన తెదేపా ఇన్‌ఛార్జికి ఒక మంత్రి ఫోన్‌ చేసి.. ‘ఎందుకమ్మా వ్యాపారాలు అవీ ఉన్నాయి కదా..! ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థుల్ని పోటీచేయించి హడావుడి చేయొద్దు’ అని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది.

* అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తెదేపా మద్దతుతో ఎన్నికల్లో పోటీచేస్తున్న ఒక అభ్యర్థిని.. వైకాపాలోకి వస్తే, అతనికి రావలసిన బిల్లులు మంజూరు చేయిస్తామని, సగం.. సగం పంచుకుందామని బేరం పెట్టారు.

* రాయదుర్గం నియోజకవర్గంలో తమ మాట వినలేదని తెదేపా మద్దతుదారును కిడ్నాప్‌ చేశారు. అధికార పార్టీ నాయకులే కిడ్నాప్‌ చేయించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

* ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెదేపా సర్పంచి అభ్యర్థి భర్తను కిడ్నాప్‌ చేయడం, ఆయన అనుమానాస్పదస్థితిలో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీవారే ఆ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

* నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల ఉపాధిహామీ పనులు చేసిన తెదేపా నాయకులకు బిల్లులు ఇప్పిస్తామని అధికార పార్టీ నాయకులు వల వేస్తున్నారు. జూన్‌లోగా వారి బిల్లులు వస్తాయని ప్రమాణాలు చేస్తున్నారు. ఇప్పుడే బిల్లులు కావాలంటే.. 20 శాతం మినహాయించుకుని తామే ఇచ్చేస్తామని, బిల్లు వచ్చాక పూర్తి మొత్తం తీసుకుంటామని చెబుతున్నారు. తెదేపా అభ్యర్థులు బలంగా ఉన్నచోట.. సర్పంచ్‌ పదవి తమకు ఇచ్చేస్తే ఉపసర్పంచ్‌ పదవి, కొంత డబ్బు ఇస్తామని ప్రలోభపెడుతున్నారు.

ఇదీ చదవండి: తెదేపా నేత పట్టాభిపై దాడి.. అసలేం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.