ETV Bharat / city

న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల పాత్ర ఉంది: టీకాంగ్రెస్

author img

By

Published : Feb 26, 2021, 2:23 PM IST

హైదరాబాద్​ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై ఫిర్యాదు చేశారు.గవర్నర్ సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు

congress leaders met with governor tamilisai in hyderabad
న్యాయవాద దంపతుల హత్య

తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసింది. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై ఫిర్యాదు చేశారు. హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి ఉన్నారు.

హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నా... పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. న్యాయవాద దంపతుల హత్య రాష్ట్రాన్ని కుదిపేసిందని.. ఈ హత్యను రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటనగా అభివర్ణించారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం, మంథనిలో తెరాస అక్రమాలకు అడ్డుగా నిలవడంతోనే వామన్ రావు దంపతులను పథకం ప్రకారం హత్య చేశారని ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిసరాల్లో నుంచి 4వేల కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించాలని... దీనిపైనా వామన్ రావు పోరాటం చేసేందుకు సిద్ధమవుతుండగా మట్టుబెట్టారన్నారని తెలిపారు.

గవర్నర్‌ తమిలిసైని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం

న్యాయవాద దంపతుల హత్యలో పోలీసుల పాత్ర ఉందని జనం నమ్ముతున్నారని.. న్యాయవాద దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళిసైని కోరినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థపై దాడిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొందన్నారు. సీఎం కేసీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు. మృతుల కుటుంబానికి భరోసా కల్పించలేకపోయారని విమర్శించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్​కు అక్రమ మార్గంలో సేకరిస్తున్న నిధులను వామన్ రావు బయటపెట్టటంతోనే అడ్డు తొలగించుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: 10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.