ETV Bharat / city

తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ బెదరదు: తులసిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై వేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు. కౌలు నగదు అడిగిన రైతులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. పాఠశాలలు తెరవాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు.

Congress Leader tulasireddy fires on Government over arrests
తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ బెదరదు: తులసిరెడ్డి
author img

By

Published : Aug 26, 2020, 5:49 PM IST

డాక్టర్ గంగాధర్​పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ బెదరదని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేటస్​ కో ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు.

రాజధాని అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌలు చెల్లించాలని అడిగిన రైతులను అరెస్టు చేయడం దుర్మార్గమని చెప్పారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరవాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.