ETV Bharat / city

'ఆ విధానం మాతృభాషలను.. మృత భాషలుగా కాకుండా కాపాడుతుంది'

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానం స్వాగతించదగ్గదేనని ఏపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. మాతృభాషను విస్మరించడమంటే.. మాతృమూర్తిని విస్మరించడమేనన్న ఆయన.. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలనడం శుభపరిణామమని పేర్కొన్నారు.

'ఆ విధానం మాతృభాషలను.. మృత భాషలుగా కాకుండా కాపాడుతుంది'
'ఆ విధానం మాతృభాషలను.. మృత భాషలుగా కాకుండా కాపాడుతుంది'
author img

By

Published : Jul 30, 2020, 6:12 PM IST

జాతీయ నూతన విద్యా విధానం మాతృభాషలను.. మృతభాషలుగా కాకుండా కాపాడుతుందని ఏపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కస్తూరి రంగన్​ కమిటీ సూచించిన విదంగా ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించాలనడం శుభ పరిణామమని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, విశ్వకవి రవీంద్రుడు, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్​ కలాం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

మాతృభాషను విస్మరించడమంటే మాతృభూమి, మాతృమూర్తిని మరువడమేనని తులసిరెడ్డి అన్నారు. యునెస్కో సైతం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే ఉండాలంటుందని చెప్పారు. భారత రాజ్యాంగంలో 350ఏ అధికరణ చెబుతోందని తులసిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధన తెలుగు భాషకు, జాతికి ఎంతో ఉపయోగకరమన్నారు.

ఇదీ చూడండి..

మిషన్ బిల్డ్ ఏపీపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.