ETV Bharat / city

కొత్త జిల్లాల ఏర్పాటుతో... వర్సిటీల పరిధులపై గందరగోళం

author img

By

Published : May 4, 2022, 10:13 AM IST

Universities scopes: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో విశ్వవిద్యాలయాల పరిధులపై గందరగోళం ఏర్పడింది. ఒక వర్సిటీ పరిధిలోని కొన్ని డివిజన్‌లు వేరే జిల్లాలో కలవడం, రెండు జిల్లాల్లోని ప్రాంతాలతో కొత్త జిల్లా ఏర్పడడం వల్ల వీటిని ఏ వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో తమ పరిధిని నిర్ణయించాలని విశ్వవిద్యాలయాలు.. ఉన్నత విద్యామండలికి లేఖలు రాస్తున్నాయి.

Universities scopes
వర్సిటీల పరిధులపై గందరగోళం

Universities scopes: గతంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినప్పుడు వాటి పరిధులను నిర్ణయించారు. ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పడినందున ఏ జిల్లాను ఏ వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే దానిపై అయోమయం నెలకొంది. జిల్లా మొత్తాన్ని ఒక విశ్వవిద్యాలయం కిందకు తీసుకువెళ్తే కొన్ని డివిజన్‌లకు వర్సిటీ దూరం పెరిగిపోతోంది. దూరం ఆధారంగా డివిజన్‌లను మాత్రమే వర్సిటీలకు అనుసంధానిస్తే ఒకే జిల్లా రెండు విశ్వవిద్యాలయాల పరిధిలోకి వస్తోంది. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పరిధిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, ఏటిపాక డివిజన్‌లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. ఈ ప్రాంతాలను ఏ వర్సిటీ పరిధిలోకి తీసుకోవాలి? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమగోదావరి, ఏలూరుగా ఏర్పడింది. ఏలూరు జిల్లాలో కృష్ణా జిల్లాకు చెందిన నూజివీడు డివిజన్‌తోపాటు గుడివాడలోని కొన్ని మండలాలు కలిశాయి. ఏలూరు జిల్లాను తమకే ఇవ్వాలని నన్నయ వర్సిటీ కోరుతుంది. ఇదే జరిగితే ఇప్పటివరకు కృష్ణా జిల్లాలోని ఎనిమిది 8 మండలాలు ఆదికవి నన్నయలోకి వెళ్లిపోతాయి. దీంతో విద్యార్థులకు దూరం పెరుగుతుంది.

వీటిపై ఏం చేస్తారు?

  • అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రాంతం ఆంధ్ర వర్సిటీ పరిధిలో ఉంది. ఈ జిల్లాలో కలిసిన రంపచోడవరం ఆదికవి నన్నయ వర్సిటీలో ఉంది. రంపచోడవరం డివిజన్‌ను ఆంధ్ర వర్సిటీలోకి కలుపుతారా? లేదంటే రెండు డివిజన్‌లు రెండు వర్సిటీల పరిధిలోకి తీసుకొస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.
  • ప్రకాశంలోని చీరాల డివిజన్‌ను బాపట్ల జిల్లాలో కలిపారు. బాపట్ల డివిజన్‌ నాగార్జున వర్సిటీలో ఉండగా.. చీరాల డివిజన్‌లోని 13 మండలాలు ప్రకాశం పంతులు వర్సిటీలోకి వస్తాయి. ఈ వర్సిటీని ఇటీవలే ఏర్పాటు చేశారు.
  • ప్రకాశం జిల్లాలోని కందుకూరు డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరు డివిజన్‌లోని ఐదు మండలాలు ప్రకాశం పంతులు వర్సిటీలో ఉండగా.. మిగతా కావలి, ఆత్మకూరు, నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీలో ఉన్నాయి.
  • తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట విక్రమ సింహపురి వర్సిటీలో ఉండగా.. శ్రీకాళహస్తి, తిరుపతి డివిజన్లు శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఉన్నాయి.
  • అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లి డివిజన్‌ కలిసింది. ప్రస్తుతం మదనపల్లి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఉండగా.. రాజంపేట, రాయచోటి డివిజన్‌లో యోగివేమన వర్సిటీలో ఉన్నాయి.

స్థానిక రిజర్వేషన్లపైనా సందిగ్ధం..: ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం ఉమ్మడి రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరును కలిపి శ్రీవేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌గా పరిగణిస్తారు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని జిల్లాలు ఆంధ్ర వర్సిటీ రీజియన్‌ స్థానికతగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు వీటినే స్థానికతగా నిర్ణయిస్తున్నారు. ఆంధ్ర వర్సిటీ రీజియన్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉండగా.. ఈ జిల్లాలోని కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపారు. ఇప్పుడు ఐదు మండలాల స్థానికతను నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆంధ్ర వర్సిటీ రీజియన్‌లో ఉండగా.. జిల్లా లెక్కల ప్రకారం శ్రీవేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోకి వెళ్లిపోయారు. స్థానికతపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: కరెంటు పెట్టిన కఠిన పరీక్ష.. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.