ETV Bharat / city

ఒకే పరీక్షకు రెండు ఫలితాలు.. బతుకులు తారుమారు - హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్​లో కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో పారదర్శకతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్​ ఉన్నవారికి కూడా నెగిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకరి సందేశం ఇంకొకరికి పంపడం లాంటి సమస్యలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒకే పరీక్షకు రెండు ఫలితాలు రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

corona rapid test problems
తికమకగా కోరనా పరీక్షలు
author img

By

Published : Jul 20, 2020, 10:25 AM IST

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు (26) శుక్రవారం మధ్యాహ్నం ఎల్‌బీ నగర్‌ పరిధి మన్సూరాబాద్‌ పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ టెస్టు చేయించుకున్నాడు. రెండు గంటల్లోనే.. పాజిటివ్‌ వచ్చిందని అక్కడి వైద్య సిబ్బంది చెప్పారు. ఆ బాధితుడు అటు అద్దె గదికి, ఇటు ఆసుపత్రికి వెళ్లలేక సతమతమయ్యాడు. శనివారం ఇదే విషయమై అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీ వైద్యులను సంప్రదించగా.. బాధితుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఉండేందుకు వసతి లేదనే వివరణ పత్రంతో అమీర్‌పేట నేచర్‌క్యూర్‌ ఆసుపత్రికి సిఫారసు చేశారు. ఆదివారం ఉదయం బాధితుడి ఫోన్‌ నంబర్‌కు పరీక్ష ఫలితం ‘నెగిటివ్’ అంటూ సందేశమొచ్చింది. దీంతో బాధితుడికి ఆందోళన, అయోమయం తప్పలేదు

ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో దొర్లుతున్న తప్పులు బాధితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక సమస్యలతో తారుమారవుతున్న ఫలితాలకు సామాన్యులు బలవుతున్నారు. ఓ చోట పరీక్షలో పాజిటివ్‌ వచ్చి, తర్వాతి రోజునే మళ్లీ ఇంకోచోట నెగిటివ్ వస్తుండటం, పైస్థాయిలో పాజిటివ్‌ అని చెప్పి... క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖలకు ఎలాంటి సమాచారం లేకపోవడం, ఒకరి సందేశం ఇంకొకరికి పంపడం లాంటి సమస్యలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒకే పరీక్షకు రెండు ఫలితాలు రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై సంబంధిత పీహెచ్‌సీలు, పరీక్ష కేంద్రాలను సంప్రదిస్తే మా తప్పేం లేదంటూ నిర్లక్ష్యంగా చేతులు దులుపుకుంటున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేరుకే ర్యాపిడ్‌!

గత కొద్దిరోజులుగా నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇన్నిరోజులు సాధారణ పరీక్షలకు వెలువడే ఫలితాల్లో జరిగిన జాప్యమే వీటిలోనూ జరుగుతోంది. అక్కడి స్థానిక సిబ్బంది మాత్రం అరగంటలో నోటిమాటగా ఫలితాలను చెప్పేస్తున్నారు. రెండురోజుల తర్వాత ఫోన్‌కు వస్తున్న సందేశాలు భిన్నంగా ఉంటున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని జిల్లాల్లో చేస్తున్న ర్యాపిడ్‌ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌ నమోదు చేస్తున్నారు. అక్కడి నుంచి బాధితుల ఫోన్‌కు సంక్షిప్త సందేశం చేరుతోంది.

రోడ్డున పడాల్సి వస్తోంది...

పోర్టల్‌ నుంచి సందేశం ఆలస్యమవుతున్న నేపథ్యంలో అది వచ్చేలోపే స్థానిక జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖల సిబ్బంది బాధితుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇంటికి కంటెయిన్‌మెంట్‌ బోర్డు తగిలిస్తున్నారు. స్థానికుల నుంచి హేళనలు, అద్దెగదుల్లో ఉంటున్నవారైతే ఖాళీ చేయక తప్పని దుస్థితులు ఏర్పడుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపంతో బాధితులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ తర్వాత అది నెగిటివ్ అని తేలినా ప్రయోజనం ఉండట్లేదు.

మాకేం సంబంధం లేదు!

ఈ ఫలితాలకు సంబంధించి తమకెలాంటి సంబంధం లేదని క్షేత్రస్థాయిలోని పరీక్షా కేంద్రాలు చేతులు దులుపుకుంటున్నాయి. రాష్ట్రస్థాయి పోర్టల్‌ నుంచే సందేశాలొస్తున్నాయి కాబట్టి తమకు సమాచారం ఉండదని చెబుతున్నాయి. కింది స్థాయిలో సిబ్బంది తప్పుగా ఎంట్రీ చేస్తే తప్ప పోర్టల్‌లో ఇలా తప్పు ఫలితం రాదని పై స్థాయి అధికారులు చెబుతున్నారు. ఇలా తప్పు మాది కాదంటే మాదని తప్పించుకుంటున్నారు.

ఇదీ చదవండి: సరిపడా అంబులెన్సులు.. అయినా సకాలంలో అందని సేవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.