చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు వీరమరణంతో.. ఆయన స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. వారి నివాసంలో బంధువులు, సన్నిహితులు పరామర్శించారు. మరోవైపు సంతోశ్ బాబు అంత్యక్రియలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటం వల్ల భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
కరోనా దృష్ట్యా కల్నల్ ఇంటి పరిసరాల్లో శానిటైజ్‌తో శుభ్రం చేశారు. స్థానికులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో జనం చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం విద్యానగర్‌లోని ఆయన ఇంటి చుట్టూ.. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కల్లా.. భౌతికకాయం సూర్యాపేటకు చేరుకోనుంది.