ETV Bharat / city

two states:తెలుగు రాష్ట్రాల మధ్య ఫిర్యాదుల పర్వం

నీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతలకు అనుమతి వద్దంటూ గోదావరి బోర్డుకు ఏపీ లేఖ రాసింది. అదే సమయంలో గాలేరు-నగరి విస్తరణ ఆపాలంటూ కృష్ణాబోర్డుకు....తెలంగాణ ఫిర్యాదు చేసింది.

author img

By

Published : Oct 1, 2021, 4:58 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఫిర్యాదుల పర్వం
తెలుగు రాష్ట్రాల మధ్య ఫిర్యాదుల పర్వం

గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న, విస్తరణ చేస్తున్న ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. సీతారామ ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించవద్దని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. వాప్కోస్‌ నివేదిక ప్రకారం గోదావరిలో 13.64 టీఎంసీల లోటు ఉందన్న ఏపీ ప్రభుత్వం... ఎల్లంపల్లి దిగువన, సీతారామ ఎత్తిపోతల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉన్న వాటా 991.19 టీఎంసీలని పేర్కొంది. రాజీవ్, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలకు ఉన్న 32 టీఎంసీలతో కలిపి రెండు రాష్ట్రాల వినియోగం 530.83 టీఎంసీలకు చేరిందని తెలిపింది. పోలవరం వద్ద వినియోగం 474 టీఎంసీలు కాగా, లోటు 13.64 టీఎంసీలు పోనూ 460.36 టీఎంసీలు మాత్రమే ఉందని 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతలను చేపడితే లోటు 51.64 కు చేరుతుందని లేఖలో తెలిపింది.

కేంద్ర జలసంఘం ఆమోదించిన డీపీఆర్‌ల ప్రకారం తీసుకొంటే నీటి వినియోగమే 675.65 టీఎంసీలన్న ఏపీ దీని ప్రకారం పోలవరం వద్ద లోటు 158.46 టీఎంసీలవుతుందని వివరించింది. పోలవరం నీటిలభ్యత 561 టీఎంసీలు కాగా, సీతారామ డీపీఆర్‌లో 460.36 టీఎంసీలు మాత్రమే అని ఉందంది. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు పరిగణనలోకి తీసుకొన్న నీటి లభ్యతను ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకించిందని పేర్కొంది. సీతారామ ఎత్తిపోతల వల్ల ఇంకా నష్టం జరుగుతుందని గోదావరిలో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సి ఉందని లేఖలో వివరించింది. ఈ నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించవద్దని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు....గోదావరి నదీ యాజమాన్య బోర్డును కోరారు.

గాలేరు-నగరి ప్రధాన కాలువ 0 నుంచి 56 కిలోమీటర్ల వరకు విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టారని, ఇందుకోసం 305 కోట్లతో పరిపాలనా అనుమతి కూడా ఇచ్చారని....తెలంగాణ కృష్ణాబోర్డుకు తెలిపింది. ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులు ఎత్తిపోసి చెరువులను నింపడానికి మరో 56.83 కోట్లతో పనులు చేపట్టారని....తెలంగాణ ఈఎన్‌సీ బోర్డు దృష్టికి తెచ్చారు.

ఈ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లిస్తారని, అయితే పోతిరెడ్డిపాడు నుంచి 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవడానికి, వరద వచ్చినపుడు 11వేల150 క్యూసెక్కులు మళ్లించాల్సి ఉందని పేర్కొంది. కృష్ణా ట్రైబ్యునల్‌-2లో గాలేరు-నగరికి నికరజలాల కేటాయింపును కూడా ఆంధ్రప్రదేశ్‌ కోరలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో మార్పులు, విస్తరించడం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని, కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును కోరింది.

ఇదీ చదవండి:
నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.