ETV Bharat / city

కరోనాపై యుద్ధంలో కలిసి పోరాడదాం.. - corona increasing

కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే పోయేలా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ సైతం ఇదే చెబుతున్నారు. అలాగని ఈ వైరస్‌ను పూర్తిగా నియంత్రించే అవకాశం లేదా? అంటే .. ఎందుకు చేయలేం.. అన్న సమాధానం వస్తుంది. ఐతే ఎలాంటి పనికైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతమవుతుంది. వారి సహకారం లేకుండా కరోనా కట్టడి కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఎవరికి వారు.. వైరస్‌ అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. స్వీయ రక్షణతోపాటు సామాజిక భద్రత గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే వైరస్ ను కట్టడి చేయవచ్చు.

common man role in controlling corona virus
కరోనాపై పోరాటం
author img

By

Published : Jul 14, 2020, 5:01 AM IST

ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉంటే చాలదు. ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. భౌతికదూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు, అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావొద్దు, పార్టీలు, వేడుకల వద్దని పదేపదే చెబుతున్నా పట్టించుకునే వారేరి. ఇలాంటి ఉల్లంఘనల వల్లే చాలామంది ప్రాణాలమీదకు వస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకుండా తిరగడం వల్లే.. వైరస్‌ వ్యాప్తి జోరందుకోడానికి ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్నఇలాంటి వైఖరే పరిస్థితి చేజారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు భారత్‌ తనదైన పద్ధతులు ఎంచుకోవాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ సీడీడీఈపీ కుచెందిన నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అవకాశాలు మనకు లేవని.. పైగా ఇక్కడ ఎక్కువమంది రోజువారీ వేతనాలతో జీవితం నెట్టుకొచ్చేవారే. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడు కోవడానికి ఇతర దేశాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతులు అనుసరించాలని అంటున్నారు.

ప్రజల పూర్తిస్థాయి భాగస్వామ్యం లేకపోతే దీనిపై విజయం సాధించడం కష్టమే నని అంటున్నారు సీడీడీఈపీ కి చెందిన నిపుణులు. ముఖ్యంగా భయం నుంచి బయటపడాలి. ఈ వైరస్‌ సోకినవారిలో 98% కోలుకుని సురక్షితంగా ఉంటారు. అయితే నివారణ చర్యలు, వైద్య సదుపాయాల పెంపు, పరిశుభ్రత విషయంలో స్థానిక సంస్థలతో సహా అందరినీ భాగస్వాములు కావాలి. అప్పుడే వైరస్‌పై విజయం సాధించగలుతాం.

అందరూ చేతనైనంత సాయం చేయడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. మన స్నేహితులు, చుట్టుపక్కలవారు, అసలు మనకు తెలియనివారు... ఇలా అందరికీ మనం అండదండలు అందించినప్పుడు దీనినుంచి బయటపడగలం. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ ఎత్తి వేసి నిబంధనలు సండలించడం వల్ల పరిస్థితులు అదుపులో లేవు. ఇప్పుడే ప్రజలు మరింత ధైర్యంగా ఉండి తమవంతు భాగస్వామ్యం అందించాలి.

ఇదీ చదవండి: కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్‌ వచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.