ETV Bharat / city

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడికి ఊరట: కుటుంబరావు - కరోనా వైరస్ వార్తలు

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశంసించారు. పారిశ్రామికవేత్తలకు సహా సామాన్య ప్రజలకు చాలా ఊరట కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

kutumbarao
kutumbarao
author img

By

Published : Mar 27, 2020, 8:14 PM IST

కుటుంబరావుతో ముఖాముఖి

కరోనా ప్రభావం నుంచి సామాన్యుడికి ఊరట కలిగించే అంశాల్ని ఇవాళ ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు, రివర్స్​ రెపో రేటును తగ్గించడం సహా అన్ని రకాల టర్మ్‌లోన్ల ఈఎంఐలపై 3 నెలల మారటోరియం విధిస్తున్నట్లు కీలక ప్రకటనలు చేసింది. ఆర్బీఐ నిర్ణయాలను ఆర్థికవేత్త, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశంసించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఇది ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 3 నెలల మారటోరియం ఇవ్వటం వల్ల సామాన్య ప్రజలు కొంత ఉపశమనం పొందుతారని అంచనా వేశారు. ఈ నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై కొంత ఒత్తిడి పడినప్పటికీ ప్రభుత్వ సాయంతో త్వరలోనే కోలుకుంటాయని వివరించారు.

ఇదీ చదవండి: ఇంతకీ క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించాలా? వద్దా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.