అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. భవనాలు పూర్తి చేయాలా? వద్దా? అనే అంశంపై పరిశీలించనుంది. భవనాలు పూర్తి చేయనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధ్యయనం చేయనుంది.
ఖజానాపై భారం తగ్గించే మార్గాలపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. శాసన రాజధానికి అవసరమైన భవనాలపై కమిటీ పరిశీలిస్తుంది. సీఎస్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కమిటీ నియమించారు. శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి,ఏఎంఆర్‌డీఏ కమిషనర్, సీఎం ముఖ్య సలహాదారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఇదీ చదవండి: 'ఎర్రచందనం విక్రయానికి కేంద్ర అనుమతులు తీసుకోవాలి'