రాష్ట్ర వ్యాప్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించేదుకు సీఎస్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
సభ్యులుగా పర్యాటక, అటవీ, ఆర్దిక ,పట్టణ అభివృద్ధి, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులను నియమించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఎకో టూరిజంకి కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై కమిటీ ప్రణాళికలు రూపొందించనుంది. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు సిఫార్సు చేయనుంది.
ఇదీ చదవండి:
చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!