ETV Bharat / city

హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు.. ఉద్యోగ సంఘాల అభ్యంతరం!

committee of ministers meet with AP employees

author img

By

Published : Feb 5, 2022, 3:59 PM IST

Updated : Feb 5, 2022, 6:32 PM IST

15:55 February 05

హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, ఐఆర్ రికవరీ, ఇతర అంశాలపై చర్చ

committee of ministers meet with AP employees: ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్​ఆర్ఏ స్లాబ్ లు, ఐఆర్ రికవరీతో పాటు నిన్న అర్ధరాత్రి ప్రతిపాదించిన అంశాలపై చర్చ కొనసాగుతోంది. హెచ్‌ఆర్‌ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు ముందుంచింది. అయితే ఆయా ప్రతిపాదనలపై ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

హెచ్‌ఆర్‌ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు..

హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 8 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 9.5 శాతం, 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్‌తో 13.5 శాతం, 25 లక్షల్లోపు జనాభా ఉన్నా ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్‌తో 16 శాతం, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్‌తో 24 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది.

  • 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 8 శాతం
  • 2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 9.5 శాతం
  • 5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్‌తో 13.5 శాతం
  • 10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్‌తో 16 శాతం
  • 25 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్‌తో 16 శాతం
  • సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్‌తో 24 శాతం

మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఫిట్​మెంట్​పై మంత్రుల కమిటీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్‌ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని మరోమారు స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖతను వ్యక్తం చేసింది.

ఉద్యోగ సంఘాల అభ్యంతరం..

మంత్రుల కమిటీ ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లపై ఉద్యోగ సంఘాల అభ్యంతరం వ్యక్తం చేశాయి. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను కనీసం 12 శాతం నుంచి అమలు చేయాలన్నారు. కనీసం 12 శాతం హెచ్‌ఆర్‌ఏ నిర్ధరణ కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. మంత్రుల అభ్యర్ధనతో ఉద్యోగ సంఘాలు కొత్త ప్రతిపాదన తెచ్చాయి. 10, 12, 16 శాతం హెచ్‌ఆర్‌ఏ స్లాబులు నిర్ధరించాలని కోరాయి. ఉద్యోగ సంఘాల హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది.

అయితే సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రుల కమిటీ వెళ్లనున్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో భేటీకి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌కు కమిటీ నివేదించింది.

ఇదీ చదవండి

MINISTERS COMMITTEE MEET: సీఎం జగన్​కు మంత్రుల కమిటీ నివేదిక.

Ban On Chintamani Natakam: అత్యవసరంగా జీవో తీసుకురావాల్సిన అవసరమేంటి?: వైకాపా నేత సుబ్బారావు గుప్తా

Last Updated : Feb 5, 2022, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.