ఏపీజేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చర్చలు జరుపుతున్నారు(cmo officials discussions with ap employee associations news). ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన అధికారులు.. వారి డిమాండ్ల పై చర్చిస్తున్నారు. తక్షణమే పీఆర్సీ(prc in andhra pradesh news) అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2018 జులై నుంచి ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని జేఏసీ నేతలు అధికారులకు వివరించారు. హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్ మెంట్ పై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయడంసహా ఆర్థికేతర ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
ఉద్యోగుల పెన్షన్లు, జీతాలు ప్రతినెలా ఒకటో తారీఖునే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా, ఇతర కారణాలతో పలువురు ఉద్యోగులు మరణించారని, వారి పిల్లల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే.. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు.. సీఎస్ దృష్టికి సైతం ఉద్యోగులు తీసుకెళ్లారు. ఇప్పుడు సీఎంవో అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపుతున్నారు. మరి, ఫైనల్ గా ఏం తేలుస్తారన్నది చూడాలి.
ఇదీ చదవండి
కబడ్డీ ఆడుతున్న బాలికను లాక్కెళ్లి.. కిరాతకంగా కత్తితో పొడిచి..