గ్రామాల్లో కలెక్టర్ల 'పల్లెనిద్ర' కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరాతీసింది. నెలలో ఒక్కసారి కూడా కలెక్టర్లు జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లకపోవటం ఏమిటని ప్రశ్నించింది. వారంలో ఒక్కరోజు జిల్లా కేంద్రాలకు వెలుపల రాత్రినిద్ర చేయాలని సీఎంవో ఆదేశించింది. పల్లెనిద్ర అంశాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్న సీఎంవో... మండలస్థాయి అధికారులతో సమీక్షతోనే కొందరు సరిపుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకలెక్టర్ నెలలో 15రోజుల పాటు జిల్లా కేంద్రాలకు వెలుపల నిద్రచేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా నిర్దేశించినట్టు... సీఎంవో స్పష్టం చేసింది. గ్రామాల్లో నిద్ర చేసిన ఫోటోను వెబ్‌సైట్‌తోపాటు... సీఎంవో వాట్సప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
కలెక్టర్లపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం..! - పల్లెనిద్ర కార్యక్రమం వార్తలు
పల్లెనిద్ర కార్యక్రమంపై కలెక్టర్లు అశ్రద్ధ చూపుతున్నారని... సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ కలెక్టర్ నెలలో 15 రోజులపాటు జిల్లా కేంద్రాలకు వెలుపల నిద్ర చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
![కలెక్టర్లపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం..! పల్లెనిద్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5237466-200-5237466-1575211249209.jpg?imwidth=3840)
గ్రామాల్లో కలెక్టర్ల 'పల్లెనిద్ర' కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరాతీసింది. నెలలో ఒక్కసారి కూడా కలెక్టర్లు జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లకపోవటం ఏమిటని ప్రశ్నించింది. వారంలో ఒక్కరోజు జిల్లా కేంద్రాలకు వెలుపల రాత్రినిద్ర చేయాలని సీఎంవో ఆదేశించింది. పల్లెనిద్ర అంశాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్న సీఎంవో... మండలస్థాయి అధికారులతో సమీక్షతోనే కొందరు సరిపుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకలెక్టర్ నెలలో 15రోజుల పాటు జిల్లా కేంద్రాలకు వెలుపల నిద్రచేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా నిర్దేశించినట్టు... సీఎంవో స్పష్టం చేసింది. గ్రామాల్లో నిద్ర చేసిన ఫోటోను వెబ్‌సైట్‌తోపాటు... సీఎంవో వాట్సప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
ap_vja_37_01_collectors_nightstay_outside_headquarters_dry_3052784_0112digital_1575204276_446
Conclusion: