ETV Bharat / city

'యాస్'​ తుపాన్​పై సీఎం సమీక్ష.. ఎక్కడా ప్రాణ నష్టం ఉండొద్దని ఆదేశాలు

బంగాళాఖాతంలో యాస్ తుపాను ఏర్పడిన దృష్ట్యా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.

Yaas Cyclone
YS Jagan reviews on Yaas Cyclone
author img

By

Published : May 24, 2021, 3:22 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్ తుపాను'పై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో నిత్యావసరాల దగ్గరనుంచి.. అన్నిరకాల సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇబ్బంది లేకుండా చూడండి..

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. తుపాను వల్ల కొవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఆక్సిజన్‌ సిలెండర్లకు రీఫిల్లింగ్‌ చేసే ప్లాంట్లకూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా.. డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది..వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం జగన్‌

ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి..

తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తుపాను పరిణామాలను ఊహించి ఆమేరకు సిద్ధం కావాలన్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది..వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.