కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. కేన్సర్, కిడ్నీ వ్యాధి బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధిగ్రస్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని... 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని స్పష్టం చేశారు.
అత్యవసర కేసుల విషయంలో...
అత్యవసర కేసులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ముఖ్యంగా డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పరీక్షల సంఖ్యను పెంచాలి
రాష్ట్రంలో కరోనా పరీక్షలపై ఆరా తీసిన సీఎం.. వివరాలను తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే 6520 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశామని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు 48,034 టెస్టులు చేసినట్లు తెలిపారు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా టెస్టుల సంఖ్య బాగా పెరగడం పట్ల అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. పరీక్షల విషయంలో వెనకడుగు వద్దని... సంఖ్యను క్రమంగా మరింతగా పెంచాలని సూచించారు.
వందకే పండ్లు.. కొనసాగించండి
వంద రూపాయలకే పండ్ల కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని... సమాచారం ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: