ETV Bharat / city

కర్నూలుకు హైకోర్టు తరలిస్తూ రీ నోటిఫికేషన్‌ ఇవ్వండి

cm jagan met amith sha
అమిత్ షాతో సీఎం జగన్‌ భేటీ
author img

By

Published : Jan 19, 2021, 10:04 PM IST

Updated : Jan 20, 2021, 5:07 AM IST

22:02 January 19

అమిత్ షాతో సీఎం జగన్‌ భేటీ

''ప్రాంతాలవారీగా అభివృద్ధిలో సమతౌల్యం సాధించడానికి అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ విశాఖలో కార్యనిర్వాహక, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసింది. ఇందుకోసం ఆగస్టులో ఏపీ పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020 చేసింది. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల ప్రణాళికలో భాజపా కూడా చెప్పిందని గుర్తు చేశారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 9.25 గంటల నుంచి 10.42వరకు అమిత్‌షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలపై ముఖ్యమంత్రి కార్యాలయం రాత్రి 11 గంటల సమయంలో ఓ ప్రకటన విడుదల చేసింది.  డిసెంబరు 15న దిల్లీకి వచ్చినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మొత్తం 13 అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మరో మూడు అంశాలను కలిపి మొత్తం 16 విషయాలపై విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఇందులో పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, పెండింగ్‌ నిధుల విడుదలే ప్రధానంగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి వెంట పది మందివిజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 7 గంటలకు దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికార నివాసం 1-జన్‌పథ్‌కు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆయన  వెంట మొత్తం 10 మంది దిల్లీ చేరుకున్నారు. అందులో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జాస్తి భూషణ్‌, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పి.కృష్ణమోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. అమిత్‌షా వద్దకు మాత్రం ముఖ్యమంత్రితో పాటు విజయసాయిరెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్‌లు వెళ్లారు. అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చినందున న్యాయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చ సాగి ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. తొలుత తన నివాసంలో సీఎం జగన్‌ ఎంపీలతో సుమారు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అందులో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, అనూరాధ, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌లు పాల్గొన్నారు.

వినతి పత్రంలో ముఖ్యాంశాలు

* రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సిఫార్సు మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లకు ఆమోదించాలి. 2018 డిసెంబర్‌నుంచి చెల్లించాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.
* ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
* 2014-15లో రెవెన్యూ లోటు కింద రూ.22,948.76 కోట్లు రావాల్సి ఉండగా కేంద్రం మాత్రం దానిని రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. అందులోనూ రూ.3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన బకాయిలతో పాటు... మొత్తం రూ.18,830.87 కోట్లు విడుదల చేయాలి.
* ఏపీలో డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అందువల్ల  విద్యుత్తు రంగ పునరుత్తేజానికి సాయం అందించాలి. కుడిగి, వల్లూరు థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లతో డిస్కంలు 2040 వరకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇతర ప్లాంట్లతో పోలిస్తే వీటి రేట్లు అధికంగా ఉన్నాయి. ఇంత ధరలను చెల్లించే పరిస్థితుల్లో డిస్కంలు లేనందున ఈ విద్యుత్తును సరెండర్‌ చేయడానికి అనుమతివ్వాలి.
* తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.5,541.78 కోట్ల బకాయిలను ఇప్పించాలి. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద తెలంగాణ డిస్కంలకు షరతులతో కూడిన రుణాలను అందించి ఏపీకి బకాయిలు చెల్లించేలా చూడాలి.
* దిశ బిల్లు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాలకు అనుమతివ్వాలి. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి.

ఇదీ చదవండి:

 ప్రవీణ్ చక్రవర్తిపై సీఐడీ సైబర్‌ క్రైమ్‌లో కేసు

Last Updated : Jan 20, 2021, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.