సెప్టెంబర్1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎక్కడా లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల తో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో బియ్యం సేకరణ ,ప్యాకింగ్ , పంపిణీ పై తీసుకున్న చర్యలను సీఎం కు అధికారులు వివరించారు. దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అందుకు తగ్గట్లుగా తినగలిగే బియ్యం సేకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపైనా...ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. తొలి త్రైమాసికంగా వచ్చిన రాబడి, ఖర్చు , వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఇవీ చూడండి-రైతు చేతికే పంట నష్ట పరిహారం: సీఎం జగన్