ETV Bharat / city

ఆవిష్కరణలకు అందలమైన టీహబ్.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ - కేసీఆర్ తాజా వార్తలు

THub 2 launch: అందమైన రంగుల రంగుల భవనం... చూడగానే ముచ్చటేస్తుంది. ఇదేదో అమెరికాలో ఉందనుకుంటే మనం పొరపడినట్లే.. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌ భవనం. ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు.

1
1
author img

By

Published : Jun 28, 2022, 7:59 AM IST

THub 2 launch: ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రారంభించనున్నారు. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్‌మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరవు అడుగుల్లో) నిర్మించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైయింట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. అడోబ్‌ ఛైర్మన్‌, సీఈవో శంతనునారాయణ్‌, సికామోర్‌ నెట్‌వర్క్స్‌ సీఈవో దేశ్‌పాండే, అతేరా ఎండీ కన్వయ్‌ రేఖి, ఇతర దేశవిదేశీ ప్రముఖులు వీడియో సందేశాలు ఇస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీశాఖ కూయాప్‌తో...హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్‌, పొంటాక్‌, వెబ్‌3 సంస్థలతో టీహబ్‌ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

.

ఉదయం నుంచే కార్యక్రమం.. టీహబ్‌ కొత్త భవనంలో ఉదయం 9.30 నుంచే డ్రమ్‌ జామ్‌తో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కలారీ క్యాపిటల్‌కు చెందిన రవీందర్‌సింగ్‌, డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు చెన్నమనేని రోహిత్‌, మోఎంగేజ్‌ సహవ్యవస్థాపకుడు రవితేజ దొడ్డా, స్విగ్గి సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి, ‘కూ’సంస్థ సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణలు పాల్గొనే చర్చాగోష్ఠిలో సినీ నటుడు దగ్గుబాటి రానా కీలక ఉపన్యాసమిస్తారు.

ఆవిష్కరణలకు ప్రోత్సాహం.. ఈ సందర్భంగా పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ టీహబ్‌ కొత్త ప్రాంగణం వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడారు. టీహబ్‌ కొత్త భవనం ద్వారా ఆవిష్కరణలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. వెంచర్‌ క్యాపిటలిస్టులు కోరితే ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఉచితంగా స్థలం ఇస్తామన్నారు. టీహబ్‌ ప్రస్తుత భవనంలోని 250 అంకురాలు జులై మొదటి తేదీ నుంచి కొత్త భవనంలోకి మారతాయన్నారు. టీహబ్‌ పక్కనే నిర్మించిన టీవర్క్స్‌ బిల్డింగ్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. ఇమేజ్‌ యానిమేషన్‌ భవన సముదాయాన్ని సంవత్సరాంతానికి పూర్తిచేస్తామన్నారు.

టీహబ్‌ జిగేల్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన టీహబ్‌ కొత్తభవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతున్న చిత్రాలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌కు జత చేశారు. దిల్లీ నుంచి నేరుగా సోమవారం రాత్రి టీహబ్‌ కొత్త భవన సముదాయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.