ETV Bharat / city

బెడ్లు లేవనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినపడొద్దు: సీఎం జగన్​

కొవిడ్‌ మృతుల నుంచి వైరస్‌ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ అన్నారు. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదని పేర్కొన్నారు. వైరస్ కారణంగా మానవత్వం మరుగునపడే పరిస్థితులు చూస్తున్నామన్నారు.

cm jagan video conference with collectors

author img

By

Published : Jul 28, 2020, 3:35 PM IST

Updated : Jul 28, 2020, 5:52 PM IST

బంధువులెవరూ రాకుంటే ప్రభుత్వమే అంత్యక్రియలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కరోనా మృతులకు పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. వచ్చే 6 నెలలపాటు 17వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చామన్న సీఎం..వచ్చే వారం రోజుల్లో కొరత లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉంటే సగం సమస్యలు తగ్గుతాయన్నారు. క్వాలిటీ ఫుడ్, శానిటేషన్‌ బాగుంటే సమస్యలు తగ్గుతాయని సీఎం స్పష్టం చేశారు.

'కొవిడ్‌ ఆస్పత్రుల్లో అత్యవసర పరికరాలు ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. ఆక్సిజన్‌, బెడ్స్‌ను పెంచాలని నిర్ణయించాం. వచ్చే 15రోజుల్లో అవి అందుబాటులోకి రావాలి. రాష్ట్రస్థాయిలో ఉన్న 10 క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు, అలాగే జీజీహెచ్‌ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌ లాంటి ఖరీదైన మందులను అందుబాటులో ఉంచండి. పేషెంట్‌కు కనీసం రూ.30-35వేలు ఖర్చువుతుంది' అని జగన్ అన్నారు.

కొవిడ్​పై ప్రచారం చేయాలి

కొవిడ్‌ రాకుండా జాగ్రత్తలు, చికిత్సపై భారీగా ప్రచారం చేయాలని సీఎం జగన్ అన్నారు. కొవిడ్ పరీక్షలు, ఇతర వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. కాల్‌ సెంటర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. పరిస్థితి చూసి హోం క్వారంటైన్, జిల్లా, రాష్ట్రస్థాయి కొవిడ్‌ కేంద్రాలకు పంపిస్తామన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులను వైద్యులు పర్యవేక్షించాలని కోరారు. విజిట్‌ చేసి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలన్నారు.

నిధులెంతైనా తీసుకోండి

మనకున్న 80 వేల పడకలను సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం.. ఎవరు వచ్చినా బెడ్‌ దొరకలేదనే మాట రాకూడదని స్పష్టం చేశారు. ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కలెక్టర్, జేసీని బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. కొవిడ్‌ నివారణ చర్యల్లో నిధుల విషయంలో రాజీ పడవద్దన్నారు. ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తామన్నారు.

కరోనా కేసులను తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదు. రోజూవారీ చేసే కరోనా పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్‌ క్లస్టర్లలోనే 90 శాతం పరీక్షలు చేస్తున్నాం. కరోనా కట్టడిలో అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారు. కొవిడ్‌ వస్తుంది.. పోతుంది.. దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదైనా సగంమందికి నయమైంది. 85 శాతం మందికి ఇళ్లలోనే నయమైంది. దేశంలో కరోనా మరణాల రేటు 2.5 శాతం, రాష్ట్రంలో 1.06 శాతం ఉంది.

-సీఎం జగన్

వర్షాకాలం ప్రారంభం అయ్యింది:

వర్షాకాలం ప్రారంభమైందని... సీజన్‌ వ్యాధులు వస్తాయని సీఎం జగన్ అన్నారు. డయేరియా, డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి జ్వరాలు ఉంటాయని.. వీటి విషయంలో వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్‌ రూమ్స్‌ కేవలం కొవిడ్‌ కోసమే కాకుండా... ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఎవరైనా కాల్‌చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలని సీఎం ఆదేశించారు.

Last Updated : Jul 28, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.