ETV Bharat / city

కేంద్రం ఇచ్చిన కేటాయింపుల ప్రకారమే వ్యాక్సిన్ పంపిణీ : సీఎం జగన్ - కరోనాపై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రుయా ఆస్పత్రిలో తరహాలో తప్పులు మళ్లీ జరక్కుండా.. భవిష్యత్తులో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మృతి చెందిన 11 మంది కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

కేంద్రం ఇచ్చిన కేటాయింపుల ప్రకారమే వ్యాక్సిన్ పంపిణీ : సీఎం జగన్

author img

By

Published : May 11, 2021, 2:41 PM IST

Updated : May 11, 2021, 8:16 PM IST

రాష్ట్రంలో సరిపడా వ్యాక్సిన్ లేనందును ముందుగా 45 ఏళ్ల వయసుపైన ఉన్న వారికే వ్యాక్సిన్లు వేయాలని సీఎం ఆదేశించారు. స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్, ఉపాధిహామీ పనులు, వైఎస్సార్‌ జలకళ, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, హౌసింగ్, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధతపై సీఎం సమీక్షించారు. తొలుత కొవిడ్ అంశంపై చర్చించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో డోసు వేయాల్సిన వారికి తొలుత పూర్తి చేసి ఆపై మిగిలిన వారికి కొనసాగించాలన్నారు. వ్యాక్సిన్లపై ప్రతిపక్షాలు సహా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దీన్ని ఎండగట్టాలన్నారు. ఆస్పత్రులకు ఇకపై ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ఆక్సిజన్ సరఫరా అవుతోన్న మూడు రాష్ట్రాల్లో ఐఎఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని నిర్ణయించారు.

'మనం బాధ్యత వహించాల్సి వస్తోంది'

కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని మరోసారి సీఎం జగన్ పునరుద్ఘాటించారు. 'రాష్ట్రంలో బాధాకరమైన ఘటనలు కూడా జరగుతున్నాయి. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. మనం ఎంత బాగా కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఫలితంగా 11 మంది చనిపోయారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌ లిఫ్ట్‌ చేశాం. అక్కడ నింపి... రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో ఆక్సిజన్‌ కొనుగోలు చేసి.. షిప్పుల ద్వారా తెప్పిస్తున్నాం. ఇన్నిరకాలుగా ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం.' అని సీఎం తెలిపారు.

'వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం'

అయినా కొన్ని మన చేతుల్లో లేకపోవడం వల్ల నష్టాలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. కలెక్టర్లందరూ చాలా అప్రమత్తతో వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కొవాల్సి ఉందన్నారు. రుయాలో నిన్న మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వాలని.. వారికి బాసటగా ఉండాలన్నారు. తప్పులు మళ్లీ జరక్కుండా... భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలని... తప్పును ఒప్పుకోవడం అనేది చిన్నతనం కాదని చెప్పారు.

పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులు

ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్‌ పైపులైన్లను పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సాంకేతిక సిబ్బందిని కచ్చితంగా నియమించాలన్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్‌ వెళ్లేలా చేయాలని సూచించారు. ఐసీయూలోనూ ప్రెజర్‌ బూస్టర్స్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి మనకు ఆక్సిజన్‌ వస్తోందని, పర్యవేక్షణ కోసం మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరా పెంచడంపై వీరు దృష్టిపెడతారన్నారు. తమిళనాడుకు కరికాలవలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు పరీడాలను పంపిస్తున్నట్లు సీఎం తెలిపారు. రేపట్నుంచే ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

నిరంతరం నిఘా పెట్టాలి

'జిల్లాల్లో ఆక్సిజన్‌ వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. ఎస్‌ఓఎస్‌ ఎమర్జెన్సీ మెసేజ్‌ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలి. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల్లో స్టోరేజీ కెపాసిటీలు కూడా ఎక్కడైనా ఉన్నాయా? లేదా? అనే అంశంపైనా దృష్టి పెట్టాలి. ఎక్కడైనా పరిశ్రమలు ఉన్నాయా? వాటికి సదుపాయాలు ఉన్నాయా? అనే విషయాన్ని చూడండి. ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయి. నేవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి 2, 3 ఆస్పత్రులకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ కచ్చితంగా ఉండాలి. 648 ఆస్పతులకూ కచ్చితంగా నోడల్‌ అధికారులను నియమించాలి. ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్‌ సరఫరా, ఆస్పత్రుల పనితీరు, పరిశుభ్రత, ఆహార నాణ్యత పై నోడల్‌ అధికారులు దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పడు నివేదికలు అందించాలి. ఫ్లయింగ్‌ స్క్వాడ్ లు నిరంతరం తనిఖీలు చేపట్టాలి.

- వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

'జీర్ణించుకోలేక విమర్శలు'

వ్యాక్సినేషన్ అంశంపై చర్చించిన సీఎం రాష్ట్రంలో కావాలనే రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. నెలకు కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తిచేసే సామర్థ్యం దేశంలో ఉందని, ప్రతిపక్ష నాయకులకీ తెలుసన్నారు. వీరు అధికారంలో లేరని జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో 6 కోట్లు డోసులు నెలకు కొవిషీల్డ్‌ ఉత్పత్తి చేస్తుంటే, భారత్‌ బయోటెక్‌ కోటి డోసులు ఉత్పత్తి చేస్తోందన్నారు.

'దేశంలో కేవలం 17 కోట్ల డోసులే ఉత్పత్తి అయ్యాయి'

18 ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటివరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు 1.48 కోట్ల మంది ఉన్నారని వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారని, వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరమవుతుందన్నారు. అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాయన్నారు. డబ్బులు తీసుకుని మాకు సప్లై చేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదన్నారు.

వ్యాక్సిన్లు ఇవ్వడానికి వెనకాడుతుందా?

వ్యాక్సిన్ల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉందని, ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసిందని సీఎం తెలిపారు. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్ధారిస్తామని అఫిడవిట్​లో పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారని, 1600 కోట్లు ఇవ్వలేరా? కమీషన్ల కోసం చూస్తున్నారు? అని ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సీఎం చెప్పారు. 22 నెలల కాలంలోనే 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగామని, ఇలాంటి ప్రభుత్వం 1600 కోట్లు ఖర్చు చేయడానికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి వెనకాడుతుందా? అని ప్రశ్నించారు.

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

'వాక్సినేషన్‌కు సంబంధించిన దుష్ప్రచారాన్ని కూడా ప్రతి సందర్భంలో అందరూ తిప్పికొట్టాలి. ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ.. ప్రజలు వాక్సినేషన్‌ వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందరికీ ఉచితంగా టీకా అందుతుందని, వ్యాక్సిన్ల కొరత ఉందని.. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులు ప్రకారం వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది. మీ వంతు వచ్చేంతవరకూ ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి. 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 33 లక్షలకుపైగా ఉన్న వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వీళ్లకి మొదట వేశాక, 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సరఫరాను బట్టి.. ప్రజలకు ప్రాధాన్యతక్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

బెడ్​లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతే

104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకోవాలన్న సీఎం.. 104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలన్నారు. 104కు కాల్‌చేస్తే స్పందన లేదనే మాట రాకూడదన్నారు. సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. 104కు కాల్‌చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలన్నారు. మందులు ఇవ్వడం, క్వారంటైన్‌ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్‌లు ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతన్నారు. 3 గంటల్లోకి రోగులకు బెడ్లు దొరికి వారికి సేవలందించే బాధ్యతలను తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 648 ఆస్పత్రులను ఎంపానెల్‌ చేశామన్న సీఎం.. 47 వేల 947 బెడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

'కొవిడ్ కేర్ సెంటర్లపై దృష్టి పెట్టాలి'

41 వేల 315 బెడ్లు భర్తీలో ఉన్నాయని జగన్ తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో టెంపరరీ జర్మన్‌ హాంగర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవని.. డాక్టర్లు కూడా వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. దీంతో పాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై దృష్టిపెట్టాలని నిర్దేశించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఆక్సిజన్‌ సప్లై అవసరమైనంత మేరకు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల కొనుగోలుపై దృష్టిపెట్టిందని, త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్యులను కూడా వెంటనే నియమించాలని, దీనికోసం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతల అరెస్ట్

Last Updated : May 11, 2021, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.