ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

CM JAGAN
CM JAGAN
author img

By

Published : Jan 25, 2021, 3:34 PM IST

Updated : Jan 25, 2021, 7:10 PM IST

15:28 January 25

ఎస్‌ఈసీకి సహకరించాలని ఆదేశం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపటంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్​తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పాల్గొన్నారు. విచారణ సందర్భంగా కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు, తీర్పుపై చర్చించారు. 

ఎన్నికల సంఘానికి సహకారం అందించాలా?... వద్దా?.. అనే అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌ఈసీకి సహకరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

ఇదీ చదవండి : 

పంచాయతీ ఎన్నికలు యథావిధిగా జరపాల్సిందే: సుప్రీంకోర్టు

Last Updated : Jan 25, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.