సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గంగిరెడ్డి మరణించారు. వైఎస్ భారతి తండ్రి మృతితో ముఖ్యమంత్రి ఇంట విషాదం నెలకొంది. గంగిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. గంగిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో ఈరోజు జరగనున్నాయి. గంగిరెడ్డికి జగన్ నివాళులర్పించారు.
ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం