CM Jagan Prajadarbar: ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకుగాను త్వరలో ‘ప్రజాదర్బార్‘ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నట్లు తెలిసింది. వారంలో ఐదు రోజులపాటు రోజూ ఉదయం ఆయన విన్నపాలు స్వీకరించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆ భవన నిర్మాణ సమయంలోనే చేశారు.
ప్రభుత్వంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజాదర్బార్ చేపడతారని అప్పట్లో అనుకున్నారు, అయితే ఇప్పటివరకూ జరగలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రజాదర్బార్ చర్చ మొదలైంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల నుంచి దీన్ని సీఎం చేపట్టే అవకాశం ఉందని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై కచ్చితమైన నిర్ణయమైతే ఇప్పటికీ జరగలేదని పేర్కొన్నాయి.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం ప్రజలనుంచి సీఎం విజ్ఞప్తులను స్వీకరించేలా ఏర్పాట్లు ఉంటాయని అంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు అపాయింట్‌మెంట్లు ఉంటాయని చెబుతున్నారు. అటు జనం, ఇటు నేతలతో ముఖ్యమంత్రి మమేకమయ్యేలా కార్యక్రమాలుంటాయని పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: