జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలందిస్తున్నవారికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, గంటలు మోగిస్తూ మద్దతు పలకాలని కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక అధికారులు సైరన్ మోగిస్తారని సీఎం చెప్పారు. ఆరోజు ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ:మోదీ