రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్‌కుమార్, అధికారులు హాజరయ్యారు. కరవు బాధిత ప్రాంతాలకు నీరు అందించడంపై సమావేశంలో సీఎం..అధికారులతో చర్చించారు. కృష్ణా నదికి వరద వచ్చే 50 రోజుల్లో జలాల తరలింపుపై ఆరా తీశారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్లే కాల్వల విస్తరణపై అధికారులు... ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలను కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అంశంపైనా చర్చించారు. గోదావరి నీటిని బొల్లాపల్లి మీదుగా బనకచర్లకు తరలింపును ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
అనుకున్న సమయానికి పూర్తి కావాలి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. విశాఖకు నిరంతర నీటి సరఫరా పైప్‌లైను వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనుల ప్రగతిపై సమీక్షించిన ఆయన.. పనులకు నిధులు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా.. అనుకున్న సమయానికి పోలవరం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టు పోలవరమని.. ఒక్కరోజు కూడా పనులు ఆగకుండా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: